పోలీసుల్లో మజ్లిస్ వేగు!
ఆ తరువాత ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చేతికి దాని కాపీ అందడంతో ఆయన పోలీసు శాఖపై చిందులేసి, గందరగోళం, వివాదం సృష్టించారు. పాతబస్తీలో తమ పార్టీమే అల్లర్లు సృష్టిస్తుందని ఎందుకు చెబుతున్నారో అర్ధం కావడంలేదని అసదుద్దీన్ విస్మయం చెందారు. దర్యాప్తులో భగంగా ప్రస్తుతం ఐదంతస్తుల భవనంలో గల కమిషనర్ కార్యాలయం అణువణువునూ భూతద్దంతో పరీక్షిస్తున్నారు. ఉనినతస్థాయి అధికారుల క్యాంప్ క్లర్క్ ల కదలికలను గూఢచారులు నిశితంగా పరిశీలిస్తున్నారు. కమిషనర్ కు సర్క్యులర్ ను పంపించిన లక్డీ కా పూల్ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో కూడా రహస్యంగా సమాచార సేకరణ జరుగుతోంది.
వివిధ రాంకుల్లో వున్న అధికారులతో సహా సిబ్బంది అందరి టెలిఫోన్ సంభాషణల రికార్డులను తనిఖీ చేస్తున్నారు. పోీసు శాఖకు చెందిన రహస్య సమాచారాన్ని ఒవైసీ సంపాదించడం ఇదేమీ మొదటిసారి కాదు. 2007 మేలో మక్కా మసీదు వద్ద బాంబు పేలుడు సంఘటన జరిగిన తరువాత, అనుమానితులపై డిసిపి ఎం.కాంతారావు తయారు చేసిన రహస్య నివేదిక కాపీన ఒవైసీ సంపాదించ గలిగారు.
Pages: -1- 2 News Posted: 22 April, 2009
|