వైఎస్ ఒంటరి అవుతారా?
ప్రచార కార్యక్రమాన్ని 'వైఎస్ఆర్ - జగన్ షో'గా మార్చడం ద్వారా వైఎస్ఆర్ పెద్ద సాహసమే చేశారని కాంగ్రెస్ వర్గాలు వ్యాఖ్యానించాయి. 'ఎన్నికలలో పార్టీ విజయం సాధిస్తే వైఎస్ఆర్ కు ఇక అడ్డేమీ ఉండదు. కాని పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కనుక ఏర్పాటు చేయలేకపోతే ఆయనకు తిప్పలు తప్పవు' అని కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ ఒంటరి పోరు వల్ల అనేక మంది మంత్రులు, నాయకులు తమను వదలివేసినందుకు బాధతో కుమిలిపోతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
అధిష్ఠానవర్గం రుసరుసలాడుతున్నప్పటికీ సిఎం ఈ ఒంటరి పోరును కొనసాగించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) అధ్యక్షురాలు సోనియా గాంధి, ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధి ప్రచారం సాగించడానికి కనీసం చెరి మూడు సార్లు రాష్ట్రంలో పర్యటించారు. అయితే, వారిద్దరు కాంగ్రెస్ ప్రభుత్వం గురించే మాట్లాడారు గాని సిఎంను పేరును ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. 'ఈ దశలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కన్నా వైఎస్ఆరే అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నారనవచ్చు' అని ఒక నాయకుడు అన్నారు.
Pages: -1- 2 News Posted: 22 April, 2009
|