కాపు మంత్రుల తిప్పలు
విజయవాడ : ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) తరఫున పోటీచేస్తున్న అంతగా పేరు లేని అభ్యర్థులు ఈ ప్రాంతంలో కాపులతో సహా కాంగ్రెస్ మంత్రులకు ఊపిరి సలపనివ్వడం లేదు. గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న మంత్రులలో పిన్నమనేని వెంకటేశ్వరరావు (గుడివాడ), మండలి బుద్ధ ప్రసాద్ (అవనిగడ్డ), కన్నా లక్ష్మీనారాయణ (గుంటూరు వెస్ట్), మోపిదేవి వెంకట రమణ (రేపల్లె), కాసు కృష్ణారెడ్డి (నరసరావుపేట) ఉన్నారు.
కాపు మంత్రులు బుద్ధ ప్రసాద్, కన్నా పట్ల కాపు ఓటర్లు ఏమాత్రం సానుకూలత కనబరచడం లేదని, తమ కులానికి చెందిన పిఆర్పీ అభ్యర్థులను సమర్థించాలని వారు యోచిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
పిఆర్పీ అభ్యర్థులు గుడివాడలో రావి వెంకటేశ్వరరావు, అవనిగడ్డలో సింహాద్రి రమేష్ కాపు వోట్లను అధిక సంఖ్యలో రాబట్టుకునే అవకాశం ఉండడంతో మంత్రులు కొత్త వర్గాలను ఆకట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు ప్రారంభించారు. పశు సంవర్ధక శాఖ మంత్రి బుద్ధ ప్రసాద్ విజయావకాశాలు కాపులు కాని ఇతర కులస్థుల ఓట్లను రాబట్టుకునే సామర్థ్యంపై ఆధారపడి ఉన్నాయి. అవనిగడ్డలో ప్రధాన అభ్యర్థులు బుద్ధప్రసాద్ (కాంగ్రెస్), అంబటి బ్రాహ్మణయ్య (టిడిపి), రమేష్ (పిఆర్పీ) ముగ్గురూ కాపులే కావడం గమనార్హం.
తెలుగుదేశం పార్టీ (టిడిపి) కృష్ణా జిల్లా శాఖ అధ్యక్షుడైన బ్రాహ్మణయ్యకు నిష్కళంకుడుగా పేరు ఉండగా, రమేష్ పూర్తిగా కాపు, యువ ఓటర్లపై ఆధారపడుతున్నారు. ఈ సెగ్మెంట్ లో రమారమి 60 వేల మంది కాపు ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్యలో వారు దాదాపు 45 శాతం మంది ఉన్నారు. గుడివాడలో ముగ్గురు అభ్యర్థులు - పిన్నమనేని వెంకటేశ్వరరావు (కాంగ్రెస్), రావి వెంకటేశ్వరరావు (పిఆర్పీ), కొడాలి నాని (టిడిపి) కమ్మ కులస్థులు. కమ్మ, కాపు కులస్థుల ఓట్లను కొల్లగొట్టడం ద్వారా ఎంఎల్ఎ, మంత్రిని ఓడించగలనని పిఆర్పీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు ఆశిస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 22 April, 2009
|