దక్షిణాదిపైనే వారికి మక్కువ
ముంబై, ఢిల్లీ, కోలకతా నగరాలతో పోలిస్తే ఈ మూడు దక్షిణాది మెట్రోలు దాదాపు 16 మిలియన్ల ఉమ్మడి అర్బన్ జనాభాతో తక్కువ పట్టణీకరణ జరిగినవే అయినప్పటికీ అధికంగా పెట్టుబడులు రాబట్టగలిగాయని అధ్యయనంలో వెల్లడైంది. అర్బన్ జనాభా ముంబైలో 18 మిలియన్లు, ఢిల్లీలో 18.7 మిలియన్లు, కోలకతాలో 15 మిలియన్ల మేరకు ఉన్నది. 'దక్షిణాది రాష్ట్రాలలో మెరుగైన రాష్ట్ర విధానాలు, ఇంజనీరింగ్, బిజినెస్ విద్యా సంస్థల కారణంగా ప్రతిభావంతులు అందుబాటులో ఉండడం, అధిక అక్షరాస్యత రేట్లు, శీఘ్రగతిన పెరుగుతున్న తలసరి ఆదాయం వంటి ప్రధాన కారణాలతో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం దక్షిణాది నగరాలు ప్రైవేట్ సంస్థల దృష్టిని ఆకర్షిస్తున్నాయి' అని జిందాల్ వివరించారు.
డిమాండ్ తగ్గుదల కారణంగా దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ దక్షిణాది టైర్ 1 నగరాలలో మొత్తం మీద మౌలిక వసతుల పెట్టుబడులలో రియల్టీ ప్రాజెక్టులలో పెట్టుబడులు అగ్ర స్థానంలో ఉన్నాయని అస్సోచామ్ నివేదిక తెలియజేసింది. 'గడచిన ఆరు నెలలలో ప్రైవేట్ రంగంలో సుమారు 12 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను ప్రకటించారు. వాటి మొత్తం పెట్టుబడి రూ. 12,990 కోట్లు. బెంగళూరులో గరిష్ఠంగా ఆరు రియల్టీ ప్రాజెక్టులు, హైదరాబాద్ లో ఐదు ప్రాజెక్టులు, చెన్నైలో ఒక ప్రాజెక్టు ప్రకటించారు' అని నివేదిక వెల్లడించింది.
Pages: -1- 2 News Posted: 24 April, 2009
|