మిత్రుల లెఫ్ట్ చూపు
పవార్ దృక్పథంతో లెఫ్ట్ కు ఇంతవరకు పెద్దగా అభ్యంతరాలేవీ లేవు. ప్రధాని అభ్యర్థిని ముందుగానే నిర్ణయించాలన్న కాంగ్రెస్ వైఖరిని సమర్థించడానికి పవార్ నిరాకరించారు. ఎవరు ప్రధాని కావాలో ఎన్నికల అనంతరమే, అందరూ చర్చించి నిర్ణయించాలని ఆయన వాదిస్తున్నారు. ఇది లెఫ్ట్ వైఖరికి తగినట్లుగానే ఉన్నది.
కాగా, ఎన్నికల అనంతర సంకీర్ణానికి లెఫ్ట్ కు ద్వారాలు 'ఇప్పటికీ తెరచి ఉన్నట్లు' పాట్నాలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జెడి) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు. 'కాంగ్రెస్ సారథ్యంలోని యుపిఎ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉంటే అది అవసరం కాగలదు' అని లాలూ యాదవ్ అన్నారు.
చివరకి లోక్ జనశక్తి పార్టీ (ఎల్ జెపి) అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ కూడా లెఫ్ట్ పట్ల సానుకూల వైఖరినే ప్రదర్శిస్తున్నారు. 'మేము లెఫ్ట్ కు ఎన్నడూ వ్యతిరేకం కాదు. అది లౌకిక శక్తులలో కొనసాగాలనే మేము కోరుకుంటున్నాం' అని పాశ్వాన్ చెప్పారు.
అయితే, లెఫ్ట్ ఫ్రంట్ తనకు కీలకమైన కంచుకోటలు బెంగాల్, కేరళ రాష్ట్రాలలో తన బలం తగ్గిందనేది అనుభవంలోకి రావచ్చు. ప్రస్తుత లోక్ సభలో 61 స్థానాలు ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ కు ఈ ఎన్నికలలో కేవలం 35 నుంచి 40 వరకు స్థానాలు లభించవచ్చునని పలువురు భావిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 25 April, 2009
|