అంతు పట్టని ఓటరు నాడి!
ఇక కాంగ్రెస్ అభ్యర్ధి సుబ్రహ్మణ్యం రెడ్డి జడ్.పి చైర్మన్ గా పార్టీలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజాదరణ పొందారు. వీటికి తోడు వైఎస్ ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన తన ప్రచార ఆయుధంగా మలచుకున్నారు. అంతేకాకుండా చంద్రబాబుపై రెండుసార్లు పోటీచేసి ఓడిపోయిన సుబ్రహ్మణ్యం రెడ్డి మూడోసారి పోటీ చేస్తుండడంతో ప్రజల సానుభూతి లభించవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ కూడా అక్కడ తెలుగుదేశం ఓట్లను చీల్చినట్టు తెలిసింది. కుప్పంలో పోలింగు కూడా భారీగా, 82.21 శాతం జరిగింది. దీంతో గెలుపు ఎవరిని వరిస్తుందనే విషయమై చర్చ జరుగుతోంది. ఇక్కడ ఎవరు గెలిచినా మెజారిటీ మాత్రం తక్కువగానే ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఇక ప్రజారాజ్యం అభ్యర్ధి చిరంజీవి విజయం నల్లేరు మీద నడకే అన్నట్టుగా తొలుత ప్రచారం సాగింది. కాంగ్రెస్ అభ్యర్ధి కరుణాకర్ రెడ్డి ఏ దశలో కూడా పోటీ ఇవ్వలేరని, పోటీ అంటూ ఏదైనా వుంటే తెలుగుదేశం అభ్యర్ధి శంకర్ రెడ్డితోనే వుంటుందని ప్రజారాజ్యం నాయకులు భావించారు. అయితే చివరి దశలో తెలుగుదేశం పూర్తిగా వెనుకబడింది. ఈ దశలో తిరుపతిలోఏర్పాటు చేసిన మహాకూటమి సభ ప్లాప్ అయింది. ఆ రెండు పార్యీల బలాలు, బలహీనతలను అంచనా వేస్తూ వచ్చిన కాంగ్రెస్ అభ్యర్ధి కరుణాకర్ రెడ్డి పార్టీలోని అన్ని వర్గాలను కలుపుకుపోవడం ద్వారా బలం పెంచుకున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 25 April, 2009
|