అంతు పట్టని ఓటరు నాడి!
లోక్ సత్తా అభ్యర్ధిగా బరిలో వున్న మాల్యాద్రి ఓట్ల చీలికతోప్రధాన అబ్యర్ధులకు చెమటలు పట్టించారు. తిరుపతిలో మాల్యాద్రికి వ్యక్తిగతంగా ఒక బలమైన వర్గం వుంది. దానికి తోడు జయప్రకాశ్ నారాయణ్ పై అభిమానంతో వున్న విద్యావంతులు, మేధావులు అనేకమంది ఉన్నారు. మాల్యాద్రి ఏ పార్టీ ఓట్లు చీల్చుతారో ఆ పార్టీ అభ్యర్ది గల్లంతు కావడం ఖాయమని చెబుతున్నారు. తెలుగుదేశం అభ్యర్ధి శంకర్ రెడ్డి చివరి నిముషంలో స్తబ్దుగా ఉండడంతో విరక్తి చెందిన పార్టీ క్యాడర్ ఏ పార్టీవైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్ధి గెలుపొందే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు ఇలాంటి పరిస్థితే జిల్లాలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా నెలకొని వుంది.
Pages: -1- -2- 3 News Posted: 25 April, 2009
|