ప్రియాంక ముక్కు ముచ్చట్లు
ఎన్నికలు 'ఒక కుటుంబ సీరియల్ కాదు' అని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆహార ధాన్యాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో కాంగ్రెస్ సమాధానం ఇవ్వాలని ఆయన అడిగారు. కాని ప్రియాంక విషయాన్ని ప్రస్తావించడం ద్వారా బిజెపి ఆ లక్ష్య సాధనకు ఎలా కృషి చేస్తున్నదో ఆయన వివరించలేదు.
సోనియా గాంధి, రాహుల్ గాంధి లేదా ప్రియాంక చేసే ప్రతి వ్యాఖ్యకు బిజెపి, సంఘ్ పరివార్ స్పందిస్తుంటాయని ప్రతీతి.
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి చేసిన 'బుధియా (వృద్ధురాలు) కాంగ్రెస్' అనే వ్యాఖ్యపై ప్రియాంక విరుచుకుపడినప్పుడు మోడి వెంటనే 'అలా అయితే బుధియా అనే వ్యాఖ్యను ఉపసంహరించుకుంటాను. దాని బదులు గుడియా (బొమ్మ) కాంగ్రెస్ అని అంటాను' అని వ్యాఖ్యానించారు.
రాహుల్ కు ఉత్తమ ప్రధాని కాగల సామర్థ్యం ఉందన్న ప్రియాంక వ్యాఖ్యపై కూడా బిజెపి నాయకులు స్పందించారు. ప్రియాంక మాటలు వింటున్నారా అని వారు మన్మోహన్ ను ప్రశ్నించారు.
నెహ్రూ - గాంధి కుటుంబ సభ్యుల వలె మన్మోహన్ సింగ్ ఎందుకు చురుకుగా ప్రచారం చేయడం లేదని బిజెపి అధికార ప్రతినిధి శుక్రవారం కూడా ప్రశ్నించారు. రాహుల్ కోసం ఉన్నత పదవిని ఆయన సిద్ధం చేస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ మరొకసారి ఆరోపించారు.
సోనియా విదేశీ జాతీయత అంశంపై గత సార్వత్రిక ఎన్నికలలో పోరు సాగించిన బిజెపికి ఈ దఫా ఆ కుటుంబంపై విమర్శలు సాగించడానికి తగిన అవకాశాలు లభించలేదు. దానితో మన్మోహన్ సింగ్ పై విమర్శలకే పార్టీ ప్రాధాన్యం ఇవ్వవలసి వస్తున్నది. అయితే, రాహుల్, ప్రియాంకలపై విమర్శలకు ఏమాత్రం అవకాశం దొరికినా బిజెపి వదలి పెట్టడం లేదు.
Pages: -1- 2 News Posted: 25 April, 2009
|