అటు హస్తం...ఇటు సైకిల్!
హైదరాబాద్: రాష్ట్రంలో కూడా సంకీర్ణ రాజకీయాల శకం ప్రారంభం కాబోయే సూచనలు కనిపిస్తున్నాయి. పోలింగుకు ముందు తరువాత కూడా ఏ రాజకీయ పార్టీకి ఓటరు నాడి అంతు పట్టడం లేదు. హంగ్ అసెంబ్లీ ఏర్పడదని పైకి ఎంత గంభీరంగా చెబుతున్నా అన్ని పార్టీలు అందుకు సిద్ధపడుతూ సంకీర్ణాల కోసం పావులు కదుపుతున్నాయి. హంగ్ అవకాశాలు ఉన్నాయని మహాకూటమి బహిరంగంగానే అంగీకరిస్తున్నా, కాంగ్రెస్ మాత్రం పైకి అంగీకరించడం లేదు. ఒకవేళ హంగ్ ఏర్పడినా అత్యధిక స్థానాలు సాధించిన ఏకైక పార్టీగా అవతరిస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.
ఎన్నికల ముందు ఒక కూటమి ఏర్పడగా, తరువాత మరో కూటమి ఏర్పడే అవకాశాలున్నాయి. హంగ్ ఏర్పడితే ఏ పార్టీ ఎవరితో కలుస్తుంది, ఎవరితో కలిస్తే ఎవరికి లాభం అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. హంగ్ ఏర్పడితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కంటె ప్రజారాజ్యం, టిఆరెస్, వామపక్షాలు, ఎంఐఎం పార్టీల అదృష్ట రేఖలు మారుతాయి. ఆ సమయంలో ఒక్కొక్క సీటు కీలకం అవుతుంది కాబట్టి చిన్నపార్టీలకే పెద్ద డిమాండ్ ఏర్పడుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం మినహా మిగతా పార్టీలన్నీ హంగ్ రావాలనీ, అప్పుడు ప్రభుత్వం ఏర్పాటులో తామే కీలకపాత్ర పోషించాలని కోరుకుంటున్నాయి.
Pages: 1 -2- News Posted: 26 April, 2009
|