అటు హస్తం...ఇటు సైకిల్!
2004లో కేంద్రంలో, రాష్ట్రంలో తమ అంచనాలన్నీ ఫలించినా, రాష్ట్రంలో కాంగ్రెస్ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణను సాధించలేకపోయామని టిఆరెస్ నాయకులు చెబుతున్నారు. ఈసారి హంగ్ పై వారే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో చంద్రబాబు చిత్తశుద్ధిపై టిఆరెస్ నాయకులెవరికీ నమ్మకం లేదు. అయితే హంగ్ వచ్చినప్పుడు తమ మద్దతు కీలకం అవుతుంది కాబట్టి వ్యవహారం తమ చేతిలోనే ఉంటుందని వారు భావిస్తున్నారు. మహాకూటమికి 160 సీట్లు వస్తాయని, తెలుగుదేశం సంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని టిఆరెస్ నాయకుడు కెసిఆర్ తమ నాయకులతో జరిపిన చర్చల్లో చెప్పారు.
ఇక ప్రజారాజ్యం కూడా ఈసారి ప్రభుత్వం ఏర్పాటులో తమదే కీలక పాత్ర అవుతుందని భావిస్తోంది. సీట్ల సంఖ్య ఎంతైనా, ముఖ్యమంత్రి పదవిపై చిరంజీవి ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి పదవి తమకు ఎవరిస్తామంటే వారి మద్దతు తీసుకుంటామని సంకేతాలు పంపిస్తోంది. మజ్లిస్ పార్టీ ెలాగూ కగాంగ్రెస్ కే మద్దతు ఇస్తుంది. హంగ్ వస్తే ప్రబుత్వం ఏర్పాటులో కాంగ్రెస్ కు లభించిన సీట్లను బట్టి ఎంఐఎం కీలకంగా మారుతుంది. ప్రజారాజ్యం కాంగ్రెస్ వైపా లేక తెలుగుదేశం వైపా అనే విషయమై రెండు పార్టీల్లోనూ జోరుగా చర్చ సాగుతోంది. మహాకూటమి ఏర్పాటులో కీలకపాత్ర వహించినవారు తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల మధ్య చెలిమి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఈ వ్యూహం ప్రజారాజ్యం నాయకులు ఎక్కువమందికి ఇష్టం లేదు. కుల రాజకీయాలపరంగా చూసినా ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదిరే అవకాశాలు తక్కువే!
Pages: -1- 2 News Posted: 26 April, 2009
|