స్టేజిల నుంచి స్టూడియోలకి!
హైదరాబాద్: 'సోదర సోదరీమణులారా!' అంటూ స్పీచ్ లు ఇవ్వడానికి పోలింగుతో తెర పడడంతో, దాదాపు నెల్లాళ్లపాటు ఎండనక వాననక ఎన్నికల ప్రచారంలో మునిగిపోయిన సినీతారలు మళ్లీ 'యాక్షన్', 'కట్', 'పేకప్' రొటీన్ లో పడిపోయారు. ఒక్క ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మినహా మిగతా అగ్రశ్రేణి నటీనటులందరూ రాజకీయ గెటప్ నుంచి సినీ మేకప్ కి మారిపోయారు. ప్రచారం ఇక ముగిసిందని ఎన్నికల కమిషన్ ప్రకటించగానే రోడ్లమీద లౌడ్ స్పీకర్లు మూగబోయాయి. ఎన్నికల కథ తాత్కాలికంగా ఓటింగ్ మిషన్ల క్లైమాక్స్ కి చేరుకోగా, యాక్టర్లంతా స్టూడియోలకు మరలిపోయారు.
టివి చానల్స్ లో, వెబ్ సైట్ లలో నిత్యం తమ అభిప్రాయాలను పరంపరగా వినిపించిన జయసుధ, జీవిత, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒక్కసారిగా నీరసించిపోయారు. జీవిత, రాజశేఖర్ తమ బ్లాగుల్లో చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై దూషణ, తిరస్కారాలను కుప్పతెప్పలుగా కురిపించారు. సికిందరాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన జయసుధ జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా విమర్శల వర్షం కురిపించారు. ఇప్పుడవన్నీ ఒక్కసారిగా వినిపించడం, కనిపించడం మానేశాయి.
Pages: 1 -2- News Posted: 28 April, 2009
|