స్టేజిల నుంచి స్టూడియోలకి!
సినిమాలంటే పడి చచ్చే అభిమాన ఓటర్లను ఆకర్షించడానికి మండుటెండలను సైతం లెక్కచేయకుండా ప్రచారం సాగించిన హీరోయిన్లు, కందిపోయిన గ్లామర్ ను మళ్లీ అందిపుచ్చుకోడానికి బ్యూటీ పార్లర్ లను ఆశ్రయిస్తున్నారు. వారం రోజులు ఎండల్లో తిరగ్గానే తెలుగుమహిళ అధ్యక్షురాలు రోజా వంటి నటీమణులు అభిమానులే గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. రెండు దఫాలుగా రాష్ట్రమంతటా పర్యటించిన యువరత్న నందమూరి బాలకృష్ణ త్వరలో విడుదల కానున్న 'మిత్రుడు' షూటింగులో బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత ఆయన రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ఒక్క వ్యాఖ్య కూడా చేయకపోవడం విశేషం. అలాగే, తెలుగుదేశం తరఫున సునామీ పర్యటన జరిపి, ప్రమాదం పాలై, ప్రచారాన్ని మధ్యలో విరమించుకున్న జూనియర్ ఎన్టీఆర్! మంచం దిగలేని కారణంగా రెండో విడత ప్రచారంలో పాల్గొనలేనని చెప్పిన జూనియర్ మొన్న చంద్రబాబు నాయుడు పరామర్శకు వచ్చినప్పుడు హాయిగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించడం గమనార్హం! ఇదంతా చూస్తుంటే, మొన్నటిదాకా చెవులు దద్దరిల్లి పోయేలా జరిగిన ప్రచారమంతా సినీ నటులంతా పాల్గొన్న మరో భారీ మల్టీ స్టార్ సినిమా షూటింగా అనిపించింది చాలామందికి!!
Pages: -1- 2 News Posted: 28 April, 2009
|