3 జిల్లాల్లోనే టిడిపి మెరుగు!
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా శాసనసభలో సాధారణ మెజారిటీ వస్తుందని ఆశిస్తున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ (టిడిపి)కి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని మూడు జిల్లాలలో మాత్రమే గణనీయ సంఖ్యలో సీట్లు లభించవచ్చు. పార్టీ అంతర్గత మదింపు ప్రకారం, గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో టిడిపికి అధికంగా స్థానాలు లభించవవచ్చు. తక్కిన జిల్లాలలో చెప్పుకోదగిన సంఖ్యలో అసెంబ్లీ సీట్లు వస్తాయనే నమ్మకం టిడిపి నాయకులకు లేదు. ఈ సూచనలతో శాసనసభలో సాధారణ మెజారిటీని సాధించడంపై పార్టీలో అనుమానాలు అంతకంతకు ఎక్కువవుతున్నాయి.
2004 ఎన్నికల వరకు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో బలంగా ఉన్న టిడిపిలో ఇప్పుడు ఆ ప్రాంతాలలోఎక్కువ సీట్లు రాకపోవచ్చుననే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆ ప్రాంతాలలో టిడిపి, ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ), కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ జరిగింది. పోలింగ్ సరళిని విశ్లేషించిన తరువాత టిడిపి నాయకులు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలోని మూడు జిల్లాలలో మాత్రమే 60 శాతంపైగా సీట్లు గెలుచుకోగలమని విశ్వసిస్తున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఏప్రిల్ 23న రెండవ దశలో పోలింగ్ జరిగిన మొత్తం తొమ్మిది జిల్లాలలోకి గుంటూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో 60 శాతం కన్నా ఎక్కువ అసెంబ్లీ సీట్లు గెలుచుకోగలమని టిడిపి నాయకులు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Pages: 1 -2- News Posted: 4 May, 2009
|