3 జిల్లాల్లోనే టిడిపి మెరుగు!
గుంటూరు జిల్లాలోని 17 సీట్లలో పది సీట్లను దక్కించుకోవచ్చునని టిడిపి ఆశిస్తున్నది. టిడిపికి అనుకూలంగా ప్రభంజనం ఉన్నట్లయితే పార్టీకి 14 అసెంబ్లీ సీట్లు రాగలవని పార్టీ వర్గాలు సూచించాయి. అయితే, గుంటూరు జిల్లాలో అన్ని సీట్లనూ తమ పార్టీ గెలుచుకోగలదని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆశిస్తున్నారు. టిడిపికి కంచుకోట అయిన అనంతపురం జిల్లాలో మొత్తం 14 సీట్లలోకి ఎనిమిది నుంచి పది వరకు అసెంబ్లీ సీట్లను గెలుచుకోగలమని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలో కూడా మొత్తం 14 సీట్లలోకి ఏడు నుంచి పది సీట్ల వరకు గెలుచుకోగలమని టిడిపి ఆశిస్తున్నది.
శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలో పార్టీ అఖండ విజయం సాధించగలదనే నమ్మకం టిడిపి నాయకులకు లేదు. చివరకు కృష్ణా జిల్లాలో కూడా తూర్పు కృష్ణా ప్రాంతంలో పిఆర్పీ బలంగా ఉన్నదని టిడిపి నాయకుడు ఒకరు అంగీకరించారు. అయితే, ఇతర జిల్లాలలో గణనీయ సంఖ్యలో సీట్లు వస్తాయనే నమ్మకం టిడిపి నాయకులకు లేదు. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా టిడిపికి సాధారణ మెజారిటీ రాకపోవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, మహా కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని టిడిపి నాయకులు ధీమాతో ఉన్నారు. ఈ ఎన్నికలలో పిఆర్పీ తరఫున పోటీ చేసిన మాజీ టిడిపి నాయకులు కొందరితో టిడిపి సంప్రదింపులు జరుపుతున్నదనే వదంతులు వినవస్తున్నప్పటికీ టిడిపి ప్రధాన కార్యదర్శి కడియం శ్రీహరి అటువంటి వార్తలను తోసిపుచ్చుతున్నారు. 'మేము తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మేము పిఆర్పీ నాయకులను సంప్రదించడం లేదు' అని శ్రీహరి స్పష్టం చేశారు.
Pages: -1- 2 News Posted: 4 May, 2009
|