'రాజ్యం'తో దేశం చర్చలు?
తెలుగుదేశం అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లేముందు, ప్రజారాజ్యం నాయకులతో చర్చించవలసిందిగా నాగంను కోరినట్టు తెలిసింది. కోటగిరి నియోజకవర్గంలో పోలింగు గురించి ఆయనతో మాట్లాడానే తప్ప పోత్తుల గురించి చర్చించలేదని నాగం చెప్పారు. అయితే విద్యాధరరావు అందుకు భిన్నమైన ప్రకటనలు చేస్తుండడంతో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ వైపు వెళ్లేది లేదని టిఆరెస్ ఖచ్చితంగా చెబుతోంది. అలాగే కేంద్రంలో మూడో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి వస్తే తాము చేరేదీ, లేనిదీ త్వరలోనే నిర్ణయిస్తామని, యుపిఎ, ఎన్డీఎ ప్రభుత్వాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వబోమని తెలుగుదేశం నాయకులు స్పష్టంగా చెబుతున్నారు. విశేషం ఏమిటంటే, ప్రజారాజ్యంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటుచేసే ప్రసక్తి లేదని, ఆ పార్టీ అధినేత చిరంజీవి కింగ్ మేకర్ కాదని తెలుగుదేశం పార్టీ మరో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి స్పష్టం చేయడం. తెలుగుదేశం నాయకులు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని కోటగిరి చేసిన ప్రకటనను శ్రీహరి ఖండిస్తూ మహాకూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
Pages: -1- 2 News Posted: 4 May, 2009
|