చిరు, కెసిఆర్ ఎత్తులు
హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా గడిపిన తరువాత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి తెలుగు దేశం పార్టీ (టిడిపి) అధినేత నారా చంద్రబాబు నాయుడు వలె కొంత కాలం విశ్రాంతి తీసుకోవడానికి ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ) అధ్యక్షుడు చిరంజీవి, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఏమాత్రం సిద్ధంగా లేరు. పైగా తమ జాగ్రత్తలలో తాము ఉండాలని వారు భావిస్తున్నారు. వైఎస్ఆర్ సిమ్లా వెళ్ళగా చంద్రబాబు యూరప్ లో ఒక అజ్ఞాత ప్రదేశానికి బయలుదేరి వెళ్ళారు.
తమ అభ్యర్థులను ప్రలోభానికి గురి చేయడానికి కాంగ్రెస్ 'మనీ మేనేజర్లు' రంగంలోకి దిగారని సమాచారం రావడంతో చిరంజీవి, కెసిఆర్ ఇద్దరూ అప్రమత్తమై తమ అభ్యర్థులను కలసికట్టుగా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నారు. డబ్బుకు కొదవలేని కాంగ్రెస్ తమ అభ్యర్థుల దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆ ఇద్దరు నాయకులు చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పరిస్థితిని బట్టి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపేందుకు రెండు పార్టీలూ సిద్ధంగా ఉన్నప్పటికీ అభ్యర్థులను ఆ పార్టీ 'ఎక్కడ కొనుగోలు చేస్తుందో'నని వారిద్దరు భయపడుతున్నారు. సంప్రదింపులు లేదా బేరసారాలు పార్టీ స్థాయిలోనే జరగాలి కాని వ్యక్తిగత స్థాయిలో కాదని పిఆర్పీ, టిఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
Pages: 1 -2- News Posted: 4 May, 2009
|