చిరు, కెసిఆర్ ఎత్తులు
ఈ రెండు పార్టీలలో పిఆర్పీనే ఎక్కువగా కలవరపడుతున్నది. ఎందుకంటే పెక్కు నియోజకవర్గాలలో పలుకుబడి గల కాంగ్రెస్ అభ్యర్థులు తన అభ్యర్థులు కొందరిని ఇప్పటికే 'తమ వైపునకు తిప్పుకున్నార'ని పిఆర్పీకి సమాచారం వచ్చినట్లు తెలుస్తున్నది. సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన ముఖ్యులైన నాయకులు కొందరిపై అనుమానపు దృక్కులు పడుతున్నాయి. ప్రస్తుతానికైతే తన అభ్యర్థులను పార్టీ కార్యాలయంలో నిర్బంధించాలని గాని, ఏదైనా వేసవి విడిదికి పంపాలని గాని చిరంజీవి ఆలోచించడం లేదు. కాని ఈ నెల 16న ఫలితాలు ప్రకటితమైన తరువాత గెలుపొందిన అభ్యర్థులను ఒక చోట ఉంచేందుకు శిబిరాన్ని నిర్వహించే అవకాశం మాత్రం లేకపోలేదు. అయితే, ఇదికూడా పార్టీ గెలుచుకునే సీట్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని పార్టీ వర్గాలు సూచించాయి.
ఈలోగా తన బృందాన్ని ఉత్సాహపరచడానికి చిరంజీవి ఇతర వ్యూహాలు అనుసరిస్తున్నారు. అభ్యర్థులతో జిల్లాల వారీగా సాగిస్తున్న సమీక్షలలో మౌన విప్లవం, మహిళలు, యువజనులు అధిక సంఖ్యలో రావడం వంటి సిద్ధాంతాలను చిరంజీవి వారి వద్ద ప్రస్తావిస్తున్నారు. కనీసం 160 సీట్లనైనా గెలుచుకుని పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదనే నమ్మకాన్ని వారిలో కలిగించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు.
కాగా, టిఆర్ఎస్ పార్టీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ చాలా రోజులుగా ఇతరులు ప్రవేశించలేని ఒక కోటగా మారిపోయింది. ఈ నెల 15 నుంచి అభ్యర్థులనందరినీ అఫీసుకే పరిమితం చేయాలనే ఆలోచనలో పార్టీ అధినేత ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు విజేతలైన అభ్యర్థులను బయటకు వెళ్ళనివ్వరు. చివరకు సెల్ ఫోన్ కాల్స్ ను కూడా పర్యవేక్షిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. 2004 ఎన్నికల అనంతరం పార్టీలో కాంగ్రెస్ చీలిక తీసుకువచ్చిన దృష్ట్యా టిఆర్ఎస్ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నది.
Pages: -1- 2 News Posted: 4 May, 2009
|