పిట్ట పోరు పిట్ట పోరు...
రాంపూర్ (యుపి) : పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నగరంలో సుప్రసిద్ధ నటి, సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) అభ్యర్థి జయప్రద, కాంగ్రెస్ అభ్యర్థి బేగమ్ నూర్ బానో, భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి) అభ్యర్థి ఘన్ శ్యామ్ సింగ్ లోధా మధ్య ఆసక్తికరమైన పోటీ జరుగుతోంది. అయితే, ఈ పోటీ కన్నా కూడా సమాజ్ వాది పార్టీలో వర్గ కలహాలు, అహం కారణంగానే రాంపూర్ మరో కురుక్షేత్రంగా మారింది.
ఎస్ పి ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్, సీనియర్ పార్టీ నాయకుడు, ముస్లిం నేత ఆజం ఖాన్ మధ్య మాటల పోరు నానాటికీ ముదురుతున్నది. జయప్రద కోసం ప్రచారం చేస్తూ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కూడా 1992లో పార్టీ ఆవిర్భావం నాటి నేతలలో ఒకరైన ఆజం ఖాన్ పై ఆరోపణాస్త్రాలు సంధించారు. 'ఆజం ఖాన్ పార్టీకి నమ్మకద్రోహం చేశారు. ఆయన చర్యలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి' అని ములాయం ఆరోపించారు.
అయితే, అమర్, ఆజం మధ్య పోరు వల్ల జయప్రద అవకాశాలు మాత్రమే కాకుండా బిజెపి మైనారిటీ నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి అవకాశాలు కూడా దెబ్బ తింటున్నాయి. ఆజం ఖాన్ కాంగ్రెస్ అభ్యర్థికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నట్లు వినికిడి. కాంగ్రెస్ అభ్యర్థి, పూర్వపు నవాబు రజా అలీ ఖాన్ కోడలు బేగమ్ నూర్ బానో 2004 ఎన్నికలలో జయప్రద చేతిలో ఓడిపోయారు. కాని ఎస్ పి లో అంతర్గత పోరు కారణంగా నూర్ బానో ఈ దఫా గెలవవచ్చు.
Pages: 1 -2- News Posted: 10 May, 2009
|