పిట్ట పోరు పిట్ట పోరు...
జయప్రదకు ఒకప్పుడు మద్దతుదారులుగా ఉన్నవారు కూడా ఇప్పుడు నూర్ బానో బ్యానర్లు పట్టుకు తిరుగుతుండడం, తమ కాలర్లపై కాంగ్రెస్ బ్యాడ్జీలు పెట్టుకోవడం కనిపిస్తున్నది. అంతేకాకుండా వోటర్లపై అంతే ఇంతో ప్రభావం ఇప్పటికీ ఉన్న నవాబు కుటుంబంలో నూర్ బానో సభ్యురాలు. నవాబు కుటుంబ సభ్యుల పట్ల విధేయత ఎంతటిదో నూర్ బానో కుమారుడు నవాబ్ జాదా కజీమ్ అలీ ఖాన్ 2007 అసెంబ్లీ ఎన్నికలలో సొంతంగా పోటీ చేసి గెలుపొందడమే సూచిస్తున్నది.
ఇదంతా 'స్కల్ క్యాప్', 'టిక్కా' ధరించి ప్రచారం చేస్తున్న నఖ్వి అవకాశాలకు విఘాతం కలిగించవచ్చు. కాంగ్రెస్ సాంప్రదాయక వోట్ బ్యాంకుతో పాటు ఆజం ఖాన్ మద్దతు వల్ల మైనారిటీ వోట్లలో అధిక భాగం కాంగ్రెస్ అభ్యర్థికి లభించే అవకాశం ఉన్నది. అయితే, 'ఎన్నికల ప్రచారం నిర్వహణకు సంబంధించినంత వరకు నఖ్వి ముందంజలో ఉన్నారు. కాని ఇతర అభ్యర్థులతో పోలిస్తే ఖర్చు విషయంలో మాత్రం అంటే నియోగించిన కార్యకర్తల సంఖ్య విషయంలో ఆయన బాగా వెనుకబడి ఉన్నారు' అని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు.
కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలో యుపిఎ ప్రభుత్వం పాలన సాగిస్తున్నప్పటికీ రాంపూర్ జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థి చేసింది శూన్యమని నఖ్వి ఆరోపించారు. 'రాంపూర్ లో దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న ప్రజల సంక్షేమార్థం తాను మంజూరు చేయించిన అభివృద్ధి ప్రాజెక్టు ఇదీ అని బేగంను చూపమనండి' అని నఖ్వి అన్నారు. ఈ నియోజకవర్గంలో బిఎస్ పి అభ్యర్థి ఘన్ శ్యామ్ సింగ్ లోధా కూడా రంగంలో ఉన్నప్పటికీ ఆయన అంతగా ప్రభావం చూపలేకపోతున్నారు. ఈ నియోజకవర్గంలో ఈ నెల 13న పోలింగ్ జరుగుతుంది.
Pages: -1- 2 News Posted: 10 May, 2009
|