పీఆర్పీ చుట్టూ ప్రదక్షిణలు
ఫలితాల అనంతరం చోటు చేసుకోబోయే పరిణామా లను ముందుగానే గ్రహించిన కాంగ్రెస్ పార్టీ టిడిపి కంటే ముందుగానే పీఆర్పీతో మంతనాలు మొదలుపెట్టింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అల్లు అరవింద్‌తో కాంగ్రెస్ నాయకత్వం ఈపాటికే ప్రాధమిక చర్చలు ప్రారంభించిం దన్న ప్రచారం ఉంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండకూడ దని, ఆయన స్థానంలో బిసికి(తూర్పుకాపు) ముఖ్యమంత్రి పదవితోపాటు, రెండు ఉపముఖ్యమంత్రి పదవులు సృష్టించి అందులో ఒకటి తమకు ఇవ్వాలని పీఆర్పీ చర్చల సందర్భంగా కాంగ్రెస్‌కు షరతు విధించినట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైఎస్ అనుచ రుడు, బీసీకి సిఎం ఇస్తే ఆ పదవి ఆయనను వరిస్తుందన్న ప్రచారంలో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఇటీవల చిరంజీవితో మాట్లాడటం, వైఎస్‌కు సర్వం అయిన సలహా దారు, ఎంపి కెవిపి రామచంద్రరావు పీఆర్పీ అధినేత చిరుకు ముఖ్య సలహాదారయిన అల్లు అరవింద్‌తో చర్చిం చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది. తమకు మద్దతునివ్వాలని వారు పీఆర్పీని కోరినట్లు సమాచారం.
కాంగ్రెస్ ప్రయత్నాలతో అప్రమత్తమయిన తెలుగు దేశంపార్టీ కూడా పీఆర్పీ నాయకత్వంతో మంతనాలు ప్రారంభించడం ఆసక్తి కలిగిస్తోంది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిరంజీవి ఆయనతో అత్యంత సన్నిహితంగా వ్యవహరించేవారు. అసెంబ్లీ ఎన్ని కల సమయంలో చిరు, అల్లు తమ సన్నిహితులు- బంధువులకు కొన్ని సీట్లు ఇప్పించుకున్నారన్న ప్రచారం కూడా లేకపోలేదు. పవన్-పరిటాల వ్యవహారం ముందు వరకూ చిరంజీవి టిడిపికి అనుకూలంగానే వ్యవహరిం చారని గుర్తు చేస్తున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 12 May, 2009
|