పీఆర్పీ చుట్టూ ప్రదక్షిణలు
తాజా పరిణామాల నేపథ్యంలో చిరుకు సినీరంగంలో అత్యంత ఆప్తులయిన అశ్వనీదత్తు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావును టిడిపి రాయబారులుగా ఎంచు కుంది. వారిద్దరితో చిరు-అల్లుకున్న సాన్నిహిత్యం తెలిసిందే. తెలుగుదేశం పార్టీకి తగినంత మెజారిటీ రాకపోతే పీఆర్పీ మద్దతు అవసరం అవుతుందన్న ముందు చూపుతోనే రాయబారాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ... పార్టీకి కాపులు దూరం కాకూడ దన్న భవిష్యత్ వ్యూహంతోనే టిడిపి పీఆర్పీతో రాయబా రాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
చర్చల సందర్భంగా పీఆర్పీ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ లభించకపోయినప్పటికీ, ఇరు పార్టీలకూ అనుకూల సంకేతాలే ఇచ్చారని తెలుస్తోంది. తమకు ఎన్నిసీట్లు వస్తాయన్న అంశంపై అంచనా లేకపోయినప్ప టికీ..రెండు పార్టీలకూ తన అవసరం ఉందన్న విషయాన్ని మాత్రం బాగా గ్రహించిన పీఆర్పీ నాయకత్వం తెలివిగా ఆ మేరకు ఇద్దరికీ సానుకూల సంకేతాలు ఇస్తున్నట్లు కనిస్తోంది.
Pages: -1- -2- 3 News Posted: 12 May, 2009
|