తమిళనాడు విలక్షణ ఘనత
న్యూఢిల్లీ : మహిళల అక్రమ రవాణాకు తమిళనాడు కేంద్ర స్థానంగా మారింది. వ్యభిచార వృత్తి కోసం తమిళనాడు నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపుతున్న మహిళల సంఖ్య అత్యధికంగా ఉందని కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ తాజా గణాంక వివరాల ద్వారా తెలుస్తున్నది. మనుషుల అక్రమ రవాణా (నిరోధక) చట్టం కింద 2007లో తమిళనాడులో 1199 కేసులు నమోదయ్యాయి. అన్ని రాష్ట్రాలలోకి తమిళనాడులోనే ఈ కేసులు ఎక్కువ. కర్నాటక 612 కేసులతో ఆతరువాత స్థానం ఆక్రమించింది. రెండు రాష్ట్రాలలోను యువతుల అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నందుకు 3700 మందికి పైగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలలో జాతీయ రాజధాని ఢిల్లీదే ఈ విషయంలో అగ్రస్థానం. ఢిల్లీలో మొత్తం 217 మందిని అరెస్టు చేసినట్లు, ఈ చట్టం కింద 112 మందిని దోషులుగా నిర్థారించినట్లు ఆ గణాంక వివరాల ద్వారా తెలుస్తున్నది.
2007 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా ఇటువంటి 3568 కేసులను పోలీసులు నమోదు చేసినట్లు, మహిళల అక్రమ రవాణాలో ప్రమేయం ఉన్నందుకు 9861 మందిని అరెస్టు చేసినట్లు, వారిలో 3220 మందికి నేర నిర్థారణ జరిగినట్లు ఆ సమాచారం ద్వారా తెలుస్తున్నది. మంత్రిత్వశాఖ సంకలనం చేసిన ఈ గణాంక వివరాల ద్వారా ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్రలలో దోషుల నిర్థారణ రేటుకు సంబంధించి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
Pages: 1 -2- News Posted: 15 May, 2009
|