తమిళనాడు విలక్షణ ఘనత
రెండు నెలల క్రితం ఏర్పాటైన ఈ విభాగం ఇద్దరు ఎయిర్ ఇండియా ఉద్యోగులు, ఒక ఏజెంట్ ఇంతియాజ్ రజీమ్ మరాడియాతో సహా నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడం ద్వారా ఈ సంవత్సరం మార్చిలో ఒక కేసు గుట్టును బహిర్గతం చేసింది. మరాడియాకు ఇటువంటి పెక్కు కేసులలో ప్రమేయం ఉన్నది. 'నిందితులైన ఎయిర్ ఇండియా ఉద్యోగులు దీపక్ సాల్వె, హేమంత్ మొరాడెలను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలోఅరెస్టు చేశాం. వారిద్దరూ తమ భార్యల పాస్ పోర్టులపై ఇద్దరు మహిళలను యుఎస్ కు తీసుకువెళ్ళినట్లు మా దర్యాప్తులో వెల్లడైన తరువాత వారిని అరెస్టు చేశాం' అని ఈ విభాగం పోలీస్ ఇన్ స్పెక్టర్ నిశికాంత్ పాటిల్ తెలియజేశారు.
ఈ విభాగం ముందుగా దక్షిణ ముంబైలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోషల్ సర్వీస్ బ్రాంచ్ (ఎస్ఎస్ బి)లో పని చేస్తున్నది. ఈ బృందానికి సారథ్యం వహిస్తున్న డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డిసిపి) (ఎన్ ఫోర్స్ మెంట్) షీలా సెయిల్ అభిప్రాయం ప్రకారం మనుషుల అక్రమ రవాణాకు సంబంధించిన నెట్ వర్క్ చాలా పెద్దది. కేసు మూలాలు కనుగొనేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించి పని చేయవలసి ఉంటుంది. 'ఇటువంటి నేరాలలో పాల్గొనేవారి నెట్ వర్క్ చాలా పెద్దది. కొన్ని సార్లు దర్యాప్తు సిబ్బంది నిందితుల ఆచూకీ తీయడం కోసం వివిధ నగరాలకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది' అని సెయిల్ చెప్పారు.
'ఇటువంటి ఏదైనా కేసును పోలీస్ స్టేషన్ లో నమోదు చేసినప్పటికీ ఆ స్టేషన్ లో ఉండే పోలీస్ సిబ్బంది స్థానిక క్రైమ్ కేసులతో అప్పటికే తీరిక లేకుండా ఉంటారు. శాంతి భద్రతల పరిరక్షణకు వారు తగినంత సమయం వెచ్చించవలసి ఉంటుంది. ఇటువంటి నేరాల గుట్టును ఛేదించడం వారికి కష్టం అవుతుంటుంది. అందువల్ల ఇటీవలే ఏర్పాటైన ప్రత్యేక విభాగం ఇటువంటి కేసులను క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నది' అని సెయిల్ తెలియజేశారు.
Pages: -1- 2 News Posted: 15 May, 2009
|