బాబుకు బ్రేకేసిన చిరు, జేపి!
మంత్రి జానారెడ్డి పోటీ చేసిన నాగార్జున సాగర్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి పి.చిన్నప్పరెడ్డికి 61వేల 74 ఓట్లు రాగా, మంత్రికి 67 వేల 958 ఓట్ల పోలయ్యాయి. ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన రామచంద్రనాయక్ 8600 ఓట్లను చీల్చుకోవడంతో మంత్రి జానా స్వల్ప మెజారిటీతో గట్టెక్కారు. ఇదే జిల్లాలోని సూర్యా పేట నుంచి పోటీ చేసిన మరో మంత్రి ఆర్.దామోదర్ రెడ్డికి 57014 ఓట్లు రాగా, టిఆర్ఎస్ అభ్యర్థి చంద్రశేఖర రెడ్డికి 50817 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడి నుంచి పిఆర్పి అభ్యర్థిగా బరిలోకి దిగిన ధనుంజయ్ గౌడ్ కు 24696 ఓట్లు వచ్చాయి. దీని వల్ల మంత్రి దామోదరరెడ్డి 6197 ఓట్లతో గట్టెక్కారు. అలాగే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డికి 65077 ఓట్లు రాగా, ఇక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డికి 57244 ఓట్లు పోలయ్యాయి. ప్రజారాజ్యం అభ్యర్థి ఎవిఎన్ రెడ్డి 18593 ఓట్లను భారీగా చీల్చుకోవడం వల్లనే మంత్రి సబిత 7833 ఓట్లతో గట్టెక్కారు. రాష్ట్రంలో అతి తక్కువ ఓట్లతో గట్టెక్కిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పోటీ చేసిన జనగాం నియోజకవర్గంలో 61218 ఓట్లు రాగా, టిఆర్ఎస్ కె.ప్రతాప్ రెడ్డికి 60982 ఓట్లు వచ్చాయి.
ప్రజారాజ్యం అభ్యర్థి జల్లి సిద్ధయ్యకు 9217 ఓట్లను చీల్చుకోవడం వల్లనే మంత్రి బొటాబొటి మెజార్టీతో బయటపడ్డారు. శ్రీకాకుళం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావుకు 56455 ఓట్లు రాగా, టిడిపి అభ్యర్థి సూర్యనారాయణకు 51947 ఓట్లు పోలయ్యాయి. పిఆర్పి అభ్యర్థి కొర్ని ప్రతాప్ 28553 ఓట్లను భారీగా చీల్చుకోవడం వల్ల మంత్రి ధర్మాన 4142 ఓట్లతో గెలిచారు. గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసిన మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు 43990 ఓట్లు పోలుకాగా, టిడిపి అభ్యర్థి చుక్కపల్లి రమేష్ కు 40916 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడి నుంచి పోటీ చేసిన పీఆర్పీ అభ్యర్థి రామచంద్రప్రభుకు 33713 ఓట్లు వచ్చాయి. మంత్రి కన్నా కేవలం 3300 ఓట్లతో గట్టెక్కారు. అలాగే చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి పోటీ చేసిన మంత్రి గల్లా అరుణ కుమారికి 71664 ఓట్లు రాగా, టిడిపి మహిళా అధ్యక్షురాలు ఆర్ కే రోజాకు 60864 ఓట్లు వచ్చాయి. పిఆర్పీ అభ్యర్థి సాయి రమణి రెడ్డికి 29794 ఓట్లు రావడంతో మంత్రి గల్లా 10800 ఓట్ల ఆధిక్యతతో బయటపడ్డారు.
ఇక మహాకూటమిని లోక్ సత్తా కూడా కంగుతినిపించింది. కనీసం పాతిక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయానికి లోక్ సత్తా దోహదం చేసింది. గుంటూరు వెస్ట్ లో కాంగ్రెస్ కు 3301 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇక్కడి టిడిపికి 40916 ఓట్లు రాగా, లోక్ సత్తాకు 4787 ఓట్లు వచ్చాయి. బాపట్ల, తెనాలి పెనమలూరు, విజయవాడ సెంట్రల్, తిరువూరు, చింతలపూడి, తణుకు, పెందుర్తి, నెల్లిమర్ల, సాలూరు, టెక్కలి, మధిర, పినపాక, సనత్ నగర్, బోధన్, జనగాం, కంటోన్మెంట్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి, ఎల్ బి నగర్, మల్కాజగిరి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు, మహాకూటమి కంటే వచ్చిన మెజార్టీని విశ్లేషిస్తే, లోక్ సత్తా ఈ కూటమికి బాగా గండి కొట్టిందని విదితమవుతోంది. మల్కాజగిరిలో కాంగ్రెస్ కు 9303 ఓట్ల మెజార్టీ వచ్చింది. కాగా ఇక్కడ మహాకూటమికి 47,326 ఓట్లు వచ్చాయి. కాగా లోక్ సత్తాకు 20,000 వేల వోట్లు వచ్చాయి. మేడ్చల్ లాంటి గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్ల విశ్లేషణ గమనిస్తే కాంగ్రెస్ 5570 ఓట్ల మెజార్టీతో నెగ్గింది. ఇక్కడ మహా కూటమికి 63742 ఓట్లు వచ్చాయి. కాని లోక్ సత్తాకు 5947 ఓట్లు వచ్చాయి. ఎల్ బి నగర్ లో లోక్ సత్తా మహాకూటమిని మట్టికరిపించింది. ఇక్కడ కాంగ్రెస్ కు 13070 ఓట్ల మెజార్టీ వచ్చింది. మహాకూటమికి 54280 ఓట్లు వచ్చాయి. లోక్ సత్తాకు 21,363 ఓట్లు వచ్చాయి.
Pages: -1- 2 -3- News Posted: 18 May, 2009
|