బాబుకు బ్రేకేసిన చిరు, జేపి!
శేరిలింగంపల్లిలో మహాకూటమిని లోక్ సత్తా ఘోరంగా దెబ్బతీసిందనే చెప్పాలి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి 1330 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. మహాకూటమికి 59776 ఓట్లు వచ్చాయి. కాగా లోక్ సత్తాకు ఎకాఎకిన 27326 ఓట్లు వచ్చాయి. సనత్ నగర్ లో కాంగ్రెస్ 8325 ఓట్ల మెజార్టీతో నెగ్గింది. ఇక్కడ మహాకూటమికి 29699 ఓట్లు వచ్చాయి. కాగా లోక్ సత్తాకు 10,857 ఓట్లు పోలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి 1213 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. ఇక్కడ మహాకూటమికి 51502 ఓట్లు వచ్చాయి. కాని లోక్ సత్తాకు 4602 ఓట్లు పోలయ్యాయి. విజయవాడ సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ 738 ఓట్లతో నెగ్గింది. కాగా పిఆర్పీకి 51512 ఓట్లు పోలయ్యాయి. లోక్ సత్తా గణనీయంగా 6946 ఓట్లతో పిఆర్పీ అభ్యర్థి వంగవీటి రాధ గెలుపును అడ్డుకుంది.
ఉత్తర తెలంగాణా ప్రాంతంలో నిజామాబాద్ జిల్లాలో కామారెడ్డిలో 2109 ఓట్లు, ఎల్లారెడ్డి అసెంబ్లీలో 2219 ఓట్లు, నిజామాబాద్ రూరల్ లో 2586 ఓట్లు, బాల్కొండలో 2390 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి గీతారెడ్డి గెలిచిన జహీరాబాద్ లో లోక్ సత్తాకు 1261 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఆమె 2157 ఓట్లతో గెలుపొందారు. ఈ మార్జిన్ కనుక మహాకూటమికి జమ అయి వుంటే ఫలితం మరోలా వుండేది. రంగారెడ్డి జిల్లాలో కుత్బుల్లాపూర్ లో లోక్ సత్తాకు పదివేల 60 ఓట్లు వచ్చాయి. ఉప్పల్ లో 15892 ఓట్లు, మహేశ్వరంలో 7181 ఓట్లు వచ్చాయి. మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి 7833 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. లోక్ సత్తా ఓట్లు మహాకూటమివైపు మళ్లి వుంటే ఫలితం తలకిందులై వుండేది. ఖైరతాబాద్ లో లోక్ సత్తాకు 12168 ఓట్లు వచ్చాయి. ఇక్కడ దానం నాగేందర్ 14845 ఓట్ల మెజార్టీతో నెగ్గారు. లోక్ సత్తా ఓట్లు సిబిఐ మార్జీ డైరెక్టర్ విజయరామారావు విజయావకాశాలను దెబ్బ తీశాయి. సికింద్రాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి, సినీ నటి జయసుధ 4395 ఓట్లు గెలవగా, ఇక్కడ లోక్ సత్తాకు 9287 ఓట్లు రావడంతో టిడిపి అభ్యర్థి ఓటమి పాలయ్యారు.
Pages: -1- -2- 3 News Posted: 18 May, 2009
|