`మెగా' పరాభవం ఎందుకు?
కాంగ్రెస్ అభ్యర్థి బంగారు ఉషారాణిని పిఆర్పి శ్రేణులు తక్కువగా అంచనా వేశాయి. కేవలం ఒక మహిళగా, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ గానే భావించాయి. వైశ్య కులానికి చెందడంతో సామాజికపరంగా మైనార్టీగానే గుర్తించాయి. అయితే రాష్ట్రంలోని వైశ్యులంతా ఉషారాణి విజయం కోసం కృషి చేశారు. ముఖ్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్త జిఎమ్.ఆర్ బరిలో దిగారు. ఆమె గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.ఈ బాధ్యతను ఆయనకు అప్పగించారు. నిధులను నీళ్ళలా ఖర్చుపెట్టారు. అన్నింటికి మించి నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తిని ఉషారాణి వ్యక్తిగతంగా కలుసుకున్నారు ఓట్లు అభ్యర్థించారు. చిరంజీవి ఎన్నికలకు ముందు రోజు మాత్రమే పాలకొల్లు వచ్చారు. ఓటర్లను వ్యక్తిగతంగా కలుసుకోవడం కంటే రోడ్ షోలు నిర్వహించారు. ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు కూడా చిరంజీవి చరిష్మాపైనే ఆధారపడ్డారు.
నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణా బాధ్యతను ఏ ఒక్క నాయకునికి అప్పగించలేదు. దీంతో ఎవరూ కూడా ఇది తమ సొంత ఎన్నికగా భావించలేదు. గెలిస్తే చిరంజీవి గెలుస్తాడని, ఓడినా ఆయనే ఓడతాడని, మహా అయితే జోగయ్య పైకి భారం పోతుందని అనుకున్నారు. దీంతో జోగయ్య ప్రాభల్యం కూడా పార్టీలో తగ్గుతుందని ఆశించారు. అనుకున్నట్టుగానే చిరంజీవి ఓటమి జోగయ్య ప్రాణాల మీదకు తెచ్చింది. ఆయన కారణంగానే చిరంజీవి ఇక్కడ ఓటమి చెందారని, చిరంజీవి సామాజిక వర్గీయులతో పాటు చిరంజీవి అభిమానులు, పిఆర్పీ శ్రేణులు ఒక నిర్ణయానికి వచ్చాయి.
Pages: -1- 2 News Posted: 18 May, 2009
|