పర్యవేక్షక పాత్రలో రాహుల్!
అయితే, మన్మోహన్ సింగ్ వలె రాహుల్ కూడా ఆర్థిక సంస్కరణలను, సామాజిక కార్యక్రమాన్ని కలసి అమలు జరపడం ప్రధానమని భావిస్తున్నారని, ఎందుకంటే ఆర్థిక పరిమితులున్న ప్రభుత్వం ఆశావహ పథకాలతో ముందుకు సాగలేకపోవచ్చునని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్థిక వ్యవస్థ పురోగమనం కారణంగానే యుపిఎ గ్రామీణ ఉపాధి పథకాన్ని, పట్టణ వనరుల పునరుపయోగ పథకాన్ని అమలు జరపగలిగింది.
బెంగళూరులో తప్ప తక్కిన మెట్రోలు, పట్టణాలు, గ్రామాలలో కాంగ్రెస్ భారీగా సత్ఫలితాలు సాధించిందని రాహుల్ గ్రహించినట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. 'ప్రభుత్వం చేయవలసిన పనులపై నగరాలు, గ్రామాల ప్రజల ఆశలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. వామపక్షాల ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం ఏమీ చేయలేకపోతున్నదని ఈ దఫా మేము చెప్పలేం. సెన్సెక్స్ కు ప్రాముఖ్యం ఇచ్చే వర్గాలను, రైతులను ఒకే సమయంలో సంతృప్తి పరచడమనే సంక్లిష్ట బాధ్యత మాపై ఉన్నది' అని మాజీ మంత్రి ఒకరు చెప్పారు.
రెండు బాధ్యతలను పూర్తి చేయడానికి రాహుల్ గాంధి తనకు తానే రెండు సంవత్సరాల గడువు నిర్దేశించుకున్నట్లున్నది. ఆ బాధ్యతలు - తాను ఇన్ చార్జిగా ఉన్న యువజన కాంగ్రెస్ 'ప్రజాస్వామికీకరణ', పార్టీ నిర్మాణానికి ఉత్తర ప్రదేశ్ లో విజయాలను ఉపయోగించుకోవడం. అంతర్గత ఎన్నికలను 'స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా' నిర్వహించాలనే యువజన కాంగ్రెస్ ప్రయోగం ఇంత వరకు పంజాబ్, గుజరాత్. ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో సత్ఫలితాలను సాధించింది. రాహుల్ లోక్ సభ టిక్కెట్లు ఇప్పించిన 10 మంది యువజన కాంగ్రెస్ నాయకులలో ఎనిమిది మంది ఈ దఫా గెలుపొందారు. అంటే ఆయన కృషి 80 శాతం విజయవంతమైందన్న మాట. ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికలలో యువజన కాంగ్రెస్ అభ్యర్థుల విషయంలో రాహుల్ విజయాల రేటు30 శాతం, 40 శాతం మధ్య ఉంది.
కాగా, తన అభ్యర్థులను ప్రభుత్వంలో చేర్చుకోవలసిందిగా రాహుల్ పట్టుబట్టకపోవచ్చునని, వారి సేవలను సంస్థలోనే ఉపయోగించుకోవచ్చునని పార్టీ వర్గాలు సూచించాయి. ఉత్తర ప్రదేశ్ లో వలె బీహార్ లో కూడా విజయాలు సాధించాలని రాహుల్ కోరుకుంటున్నారు.
Pages: -1- 2 News Posted: 19 May, 2009
|