శెభాష్..అల్లుడూ!
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విజయం వెనుక ఆయన కుటుంబంలోని ఇద్దరు ప్రముఖ పాత్ర పోషించడం విశేషం. వారిలో ఒకరు ఆయన సతీమణి విజయలక్క్ష్మి మరొకరు సువార్త ప్రచారకుడు, ఆయన అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి చాలా ముందుగానే ఆయన తరఫున ప్రచార బాధ్యతలను తలకెత్తుకుని ఆయన అల్లుడు, సతీమణి తెరవెనుక జరిపిన కృషి సామాన్యమైనదేమీ కాదు. అల్లుడు అనిల్‌కుమార్ ఎన్నికలకు చాలా ముందు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ కూటములు నిర్వహించి ప్రజలను కాంగ్రెస్ పక్షానికి లాక్కొచ్చారు. ఈ క్రమంలో అనిల్ విపక్షాల నుంచి అనేక విమర్శలకూ గురయ్యారు.
బ్రదర్ అనిల్ రాష్ర్టంలోని దాదాపు అన్ని పట్టణాల్లోనూ క్రైస్తవ కూట ములు నిర్వహించడమే కాకుండా.. ఆయా పట్ట ణాల్లో క్రైస్తవ ప్రముఖులు, చర్చి ముఖ్యలతో ప్రైవేటు సమావేశాలు నిర్వహించి.. వారి ఓట్లను కాంగ్రెస్కుఅనుకూలంగా వేయించేలా అనిల్ చేసిన కృషి ఫలితంగా, రాష్ట్రంలో దాదాపు 90శాతం క్రైస్తవుల ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో కలిసేం దుకు కారణమయింది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో అనిల్ నిర్వహించిన కూటములకు భారీ స్థాయిలో క్రైస్తవులు హాజరయిన విషయం తెలిసిందే.
Pages: 1 -2- News Posted: 21 May, 2009
|