శెభాష్..అల్లుడూ!
సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా క్రైస్తవ ఓటు బ్యాంకులో అధిక శాతం కాంగ్రెస్‌కు అనుకూలంగా మొగ్గు చూపింది. అయితే, రాష్ట్రంలో మాత్రం 40 శాతం మంది క్రైస్తవులు టిడిపి వైపు కూడా మొగ్గు చూపారు. క్రైస్తవులు ఎక్కువగా ఉండే సికింద్రా బాద్‌లో మూడుసార్లు టిడిపి నేత తలసాని శ్రీనివాస యాదవ్‌కు పట్టం కట్టడమే దానికి నిదర్శనం. ఈసారి మాత్రం క్రైస్తవ మతానికి జయసుధను గెలిపించడం గెలిపించడం విశేషం. అందులో రెండుసార్లు క్రైస్తవమతానికి చెందిన మేరీ రవీంద్రనాధ్ మీదే కావడం మరో విశేషం. చర్చిలు, క్రైస్తవులు ఎక్కువగా ఉండే కంటోన్మెంట్‌లో కూడా టిడిపి నేత సాయన్నకే క్రైస్తవులు మూడుసార్లు పట్టం కట్టారు.
అదేవిధంగా, క్రైస్తవులు ఎక్కువగా ఉండే మెదక్‌లో కూడా టిడిపిని ఆదరించారు. ఇవన్నీ రాష్ట్రంలో క్రైస్తవులు టిడిపికి సైతం మద్దతు దారులుగా ఉన్నారన్న వాస్తవాన్ని స్పష్టం చేసేవే. అయితే, ఈ ఎన్నికల్లో మాత్రం క్రైస్తవులు గంప గుత్తగా కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి కారణం వైఎస్ అల్లుడు అనిల్ కారణమంటున్నారు. క్రైస్తవు లను కాంగ్రెస్ వైపు ఆకర్షించేందుకు అనిల్ పట్టణాల్లో నిర్వహించిన క్రైస్తవ కూటములు కాం గ్రెస్ విజయానికి దోహదపడ్డాయి. ప్రతి నియోజక వర్గంలోనూ కనీసం 20 వేలు ఉండే క్రైస్తవుల ఓట్లు అనిల్ ప్రచారంవల్ల కాంగ్రెస్ ఖాతాలో కలిశాయి.
ప్రజారాజ్యం, లోక్‌సత్తా బరిలో నిలిచిన నేపథ్యంలో భారీగా ఓట్లు చీలిపోయాయి. ఆ సమయంలో దాదాపు 73 నియోజకవర్గాల్లో క్రైస్త వుల ఓట్లు కీలకమయి, చివరకు అవే అభ్యర్ధుల విజయాన్ని నిర్దేశించినట్లు ఫలితాలు చెబుతున్నాయి.అయితే, దేశంలో బిజెపి అధికారంలోకి రాకూడదన్న గట్టి పట్టుదలతో ఉన్న క్రైస్తవ-ముస్లిం ఓటర్ల అభిప్రా యం కూడా రాష్ట్రం-దేశంలో కాంగ్రెస్‌పార్టీ అధికా రంలోకి రావడానికి మరో కారణమయింది. ఇదే విషయాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు కూడా అంగీకరించడం ఈ వాదనకు మరింత బలం చేకూరుతోంది. బిజెపి అధికారంలోకి వస్తుందన్న భయంతోనే మైనారిటీలు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని ఆయన తాజాగా వెల్లడించారు.
Pages: -1- 2 News Posted: 21 May, 2009
|