'అద్వానీ ఉక్కు మనిషి కారు'
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఉక్కు మనిషి తాను చెప్పుకున్నంతగా 'బలమైన, కచ్చితమైన నిర్ణయాలుతీసుకోగల' నాయకుడు కాకపోవచ్చునని, అందుకే ఎన్నికలలో పార్టీ విజయావకాశాలు దెబ్బ తిన్నాయని ఎల్.కె. అద్వానీ సన్నిహిత సహచరుడు సోమవారం వ్యాఖ్యానించారు. 'అంతర్గత కుమ్ములాటలు' ఎన్నికలలో పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటని అద్వానీ సన్నిహిత సహచరుడు సుధీంద్ర కులకర్ణి ఆరోపించారు. బిజెపిలో 'అధినేత ఆధిపత్యం సాగలేదు' అని ఆయన సూచించారు. అద్వానీ మాటకు విలువ లేకపోయిందని ఆయన పేర్కొన్నారు.
2004 ఎన్నికలలో పరాజయం అనంతరం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోలేనంత సాధు స్వభావి అద్వానీ అని, అది 2009 ఎన్నికలలో పార్టీని నష్టం కలిగించిందని పేర్కొన్న కొన్ని రోజులకే కులకర్ణి ఒక వార్తాపత్రికలలోని తన కాలంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఎన్నికలలో ఘోర వైఫల్యానికి కారణాలను వివరించేందుకు బిజెపి ఒక వైపు తంటాలు పడుతుండగా రకరకాల సిద్ధాంతాలు ప్రచారంలో ఉండి పరిస్థితిని మరింత గందరగోళ పరుస్తున్నాయని కులకర్ణి పేర్కొన్నారు.
కాంగ్రెస్ విసిరిన సవాల్ కు తృతీయ ఫ్రంట్ తేలికగా లొంగిపోవడం కూడా బిజెపి పరాజయానికి కారణంగా పేర్కొనడం ద్వారా బిజెపి ప్రధాన ప్రచారకుడు అరుణ్ జైట్లీ తన బాధ్యతను తప్పించుకోగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) లోపభూయిష్ట ప్రచారమే కారణమని వ్యాఖ్యానించింది. యశ్వంత్ సిన్హా, షానవాజ్ హుస్సేన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి వంటి నాయకులు కొందరు సైద్ధాంతిక అంశాలపై ప్రశ్నలను లేవనెత్తారు. కాని ఇతరులు, ముఖ్యంగా వినయ్ కటియార్, యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ గురించి ఎక్కువగా ప్రచారం చేయడం విజయానికి మార్గం కాగలదని సూచించారు. 'హిందీ - హిందూ - హిందుస్థాన్ అజెండా విషయంలో రాజీ పడరాదు' అని కటియార్ అన్నారు.
Pages: 1 -2- News Posted: 26 May, 2009
|