'అద్వానీ ఉక్కు మనిషి కారు'
అయితే, కులకర్ణి వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీస్తున్నాయి. 'క్రమశిక్షణకు, సమైక్యతకు ఒకప్పుడు మారుపేరుగా నిలచిన ఈ పార్టీలో అంతర్గత లుకలుకలు కేంద్ర, రాష్ట్ర స్థాయిలలో ఎంతగా కొట్టవచ్చినంత కనిపించాయంటే, కొత్త మద్దతుదారులను ఆకర్షించడానికి బదులు అంకిత భావం కలిగిన సొంత ఓటర్లలోనే ఒక వర్గం వారిని వ్యథకు గురి చేశాయి' అని కులకర్ణి తన వ్యాసంలో పేర్కొన్నారు.
అరుణ్ జైట్లీతో కలసి ప్రచార బాధ్యతలు నిర్వహించిన కులకర్ణి ఇంకా ఇలా పేర్కొన్నారు: 'కాంగ్రెస్ పార్టీలోని ఆనువంశిక పాలనను, భజన తత్వాన్ని ఏవగించుకునే వారు కూడా అధినేత ఆధిపత్యం విషయంలో బిజెపిపై ఆ పార్టీదే పైచేయిగా ఉందని గ్రహించగలరు'.
'ఈ అంతర్గత వైరుధ్యాలను' సరి చేయలేరని, 'అధినేత ఆధిపత్యం' సాగడం లేదని సూచించడం ద్వారా బలమైన నాయకత్వాన్ని, కచ్చితమైన నిర్ణయాలు తీసుకోగల ప్రభుత్వాన్ని సమకూరుస్తామన్న బిజెపి ప్రధాన ప్రచార నినాదం ఎంత నిరర్థకమైనదో ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ లోనే అధినేత ఆధిపత్యం సాగుతున్నదని వ్యాఖ్యానించడం ద్వారా సోనియా గాంధి మాటకు ఆమె పార్టీలో విలువ ఉందని, అద్వానీ మాటకు అటువంటి విలువ లేదని కులకర్ణి సూచిస్తున్నట్లయింది.
Pages: -1- 2 News Posted: 26 May, 2009
|