లెఫ్ట్ బాటలో తృణమూల్!
లాభసాటి పిఎస్ యులో వ్యూహాత్మకమైన అమ్మకాలను పార్టీ వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఒ) ద్వారా పెట్టుబడుల ఉపసంహరణ తమకు ఆమోదయోగ్యమేనని ఆయన చెప్పారు. 'ఐపిఒ వల్ల పిఎస్ యులోకి నిధులు వస్తాయి. దీనితో సంస్థ మరింత మెరుగైన రీతిలో పని చేయగలదు' అని చటర్జీ అన్నారు.
మార్కెట్ ఆఫరింగ్ ద్వారా పలు పిఎస్ యులలో పెట్టుబడుల ఉపసంహరణ కోసం యుపిఎ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వ్యూహాత్మకమైన అమ్మకాలు కూడా కొన్ని జరగగలవు. బ్యాంకింగ్, పెన్షన్, బీమా సంస్కరణలకు ప్రభుత్వం తన అజెండాలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నది.
తమతో ఆదిలో జరిపిన సమావేశాలలో యుపిఎ ప్రభుత్వం మౌలిక వసతులు, గ్రామీణాభివృద్ధి రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సూచించిందని చటర్జీ తెలియజేశారు. 'పెట్టుబడుల ఉపసంహరణకు యుపిఎ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదు' అని ఆయన చెప్పారు.
యుపిఎ ప్రభుత్వం ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఇవే అంశాలపై వామపక్షాల ఫ్రంట్ నుంచి గట్టి ప్రతిఘటనను ఎదుర్కొన్నది. యుపిఎ ప్రభుత్వానికి లెఫ్ట్ ఫ్రంట్ మిత్ర పక్షం కాదని, ఆర్థిక సంస్కరణలు వేగం పుంజుకోగలవని గ్రహించి ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం మార్కెట్ వర్గాలు అమితానందాన్ని వ్యక్తం చేశాయి. పిఎస్ యులలో పెట్టుబడుల ఉపసంహరణ, బ్యాంకింగ్, బీమా రంగం సంస్కరణలు, రీటైల్ రంగంలో ఎఫ్ డిఐ వంటివి లెఫ్ట్ ఫ్రంట్ కు అత్యంత అభిమానపాత్రమైన అంశాలుగా ఉండేవి.
Pages: -1- 2 News Posted: 26 May, 2009
|