తగ్గిన ఉత్తరాది పట్టు
ప్రాంతీయ, వర్గ ప్రయోజనాలను పక్కకు నెట్టడం వల్ల కావచ్చు కాంగ్రెస్ పార్టీలోనే ఫ్యాక్షనల్ ఒత్తిడులు రెండవ జాబితా రూపకల్పన సమయంలో ప్రధాన పాత్ర వహించినట్లు కనిపిస్తున్నది. కాగా, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు విలాస్ రావ్ దేశ్ ముఖ్ (మహారాష్ట్ర), వీరభద్ర సింగ్ (హిమాచల్ ప్రదేశ్) మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. వారితో కలిపి మంత్రివర్గంలో 'మాజీ ముఖ్యమంత్రుల' సంఖ్య తొమ్మిదికి పెరిగింది.
ముంబైలో పదవి నుంచి తప్పుకోవలసి వచ్చిన ఆరు నెలల తరువాత దేశ్ ముఖ్ కేంద్రంలో తొలిసారిగా మంత్రి కావడం చాలామందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అక్టోబర్ లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు కేంద్రంలో 'మహారాష్ట్ర ప్రముఖుడు' ఒకరు ఉండవలసిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉందని ఢిల్లీలో ఒక వివరణ ఇచ్చారు. అయితే, దేశ్ ముఖ్ ను చేర్చుకోవడం మహారాష్ట్రలో కాంగ్రెస్ నాయకులకు ఆశ్చర్యం కలిగించలేదు. లోక్ సభ ఎన్నికలకు ముందుగా మహారాష్ట్రలో పార్టీ పరువు నిలుపుకొనే యత్నంలో ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని వారు భావించారు.
ఈ నెల 26న 64వ ఏట ప్రవేశించిన దేశ్ ముఖ్ మహారాష్ట్రలో మరొక ప్రముఖుడు లాతూరు ఎంపి శివరాజ్ పాటిల్ ను వెనుకకు నెట్టి మంత్రి పదవిని పొందారు. మరాఠ్వాడా ప్రాంతం నుంచి పార్టీ ప్రతినిధిగా నెహ్రూ - గాంధి కుటుంబ విధేయుడు పాటిల్ కన్నా దేశ్ ముఖ్ కే పార్టీ ప్రాధాన్యం ఇచ్చింది. 'ఇది అద్భుతమై జన్మదిన కానుక. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు ఈ పెద్ద బాధ్యత అప్పగించినందుకు నేను సోనియాజీకి, మన్మోహన్ సింగ్ కు, రాహుల్ గాంధికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కేంద్రంలో పని చేసేందుకు నాకు లభించిన తొలి అవకాశం ఇది. పాలనాపరమైన, రాజకీయపరమైన నా అనుభవాన్ని న్యూఢిల్లీలో ఉపయోగించేందుకు నేను ప్రయత్నిస్తాను' అని దేశ్ ముఖ్చ చెప్పారు.
సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున అవిశ్రాంతంగా ప్రచారం సాగించిన దేశ్ ముఖ్ కూడా మహారాష్ట్రలో పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలనే ప్రతిపాదన చేశారు. రాహుల్ గాంధి ఈ సిద్ధాంతాన్ని ప్రయోగాత్మకంగా అమలు జరిపిన తరువాత కాంగ్రెస్ పార్టీలో ఇది ప్రాచుర్యంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం మొదలయ్యే వరకు దేశ్ ముఖ్ ను ఢిల్లీలోనే ఉంచడం ద్వారా నారాయణ రాణెతో పార్టీలో అంతర్గత కుమ్ములాటలను తగ్గించవచ్చునని కాంగ్రెస్ ఆశిస్తున్నది.
అయితే, ఆసక్తికరమైన ఒక విషయమేమంటే, మొదటి రౌండ్ లో వలె కాకుండా ఈ జాబితాలో లోక్ సభ సభ్యుల సంఖ్యే ఎక్కువగా ఉండడం. తాజా జాబితాలోని 59 మందిలో కేవలం ముగ్గురు - ఎం.ఎస్. గిల్, పృథ్వీరాజ్ చవాన్, జైరామ్ రమేష్ ఎగువ సభ (రాజ్యసభ) సభ్యులు. మొదటి జాబితాలో 19 మంది మంత్రులలో రాజ్యసభ సభ్యులు ఏడుగురు ఉన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 28 May, 2009
|