అదృష్టం వరించేనా?
పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించాలని, వర్గాలు, గ్రూపులకు అతీతంగా వారికి నామినేటెడ్ పోస్టులను కేటాయించాలని వారు బహిరంగంగానే డిమాండ్ చేశారు. అయినా సిఎం వైఖరి మారలేదు. కాని మళ్ళీ కాంగ్రెస్సే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడైనా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తారని పార్టీ నేతలు గంపెడు ఆశలతో ఎదురు చూస్తున్నారు. వైఎస్ పాలనలో నామినేటెడ్ పోస్టులను సకాలంలో భర్తీ చేసి వుంటే ఈ ఐదేళ్ళ కాలంలో మూడు పర్యాయాలు ఈ పదవుల భర్తీ జరిగేదని, ఎంతో మంది నాయకులు కార్యకర్తలకు అవకాశం లభించేదని కొందరు నాయకులు వ్యాఖ్యానించారు. జెరూసలెం పర్యటన నుంచి తిరిగివచ్చాక వైఎస్ తో డిఎస్ సమావేశమై కార్పోరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల విషయంలో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణులను ఉత్తేజపర్చడానికి వైఎస్ కూడా ఈ సారి ఈ పదవుల పంపకాలు సమయానికి చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఈ సారి కూడా నామినేటెడ్ పోస్టుల పంపకాల్లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన వర్గానికే పెద్దపీట వేయడం ఖాయమంటున్నారు. జిల్లాల పరిస్థితులు, సామాజిక అంశాల కారణంగా మంత్రి పదవులు లభించని ఎమ్మెల్యేలు, పార్టీలో సీనియర్ నేతలను ఈ పదవుల్లో నియమించే అవకాశాలున్నట్లు పార్టీలో వినిపిస్తోంది. ప్రత్యేకించి వైఎస్ సన్నిహితులకు తొలి ప్రాధాన్యం లభించడం ఖాయమనిపిస్తోంది. ఆ తరువాత మిగతా వారికి పదవులు దక్కవచ్చంటున్నారు. అలాగే ఇటీవల ఎన్నికల్లో పరాజయం పొందిన పలువురు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలను కూడా ఈ పదవుల్లో నియమించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. టిక్కెట్లు ఆశించి వివిధ కారణాల దృష్ట్యా పార్టీ టికెట్ దక్కకపోయినా, అక్కడ పార్టీ అధికారిక అభ్యర్థి విజయానికి సహకరించిన పార్టీ నేతతలను కూడా నామినేటెడ్ పదవుల కోసం సిఎం ఎంపిక చేసే అవకాశాలున్నాయంటున్నారు.
Pages: -1- 2 News Posted: 29 May, 2009
|