టాటా చెక్కు మమత వాపసు
'ఎన్నికలకు నిధులు సమకూర్చే టాటా విధానం ఎంత పారదర్శకమైనదంటే, నానో ప్రాజెక్టు అమలుకు అభ్యంతరరం చెప్పిన తృణమూల్ కు కూడా నిధులు పంపింది' అని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, లేదా వామపక్షాలకు ఎంత మొత్తం ఇచ్చిందీ వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.
ఈ ట్రస్టులో ముగ్గురు సభ్యులు ఉన్నారు. వారు సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దినేష్ వ్యాస్, పారిశ్రామికవేత్త ఆర్దేశిర్ దుబాష్, సంఘ సేవకుడు శిరీన్ భరూచా.
ఆ డబ్బును స్వీకరించినా వచ్చే ప్రయోజనమేమీ ఉండదని, ఎందుకంటే అభ్యర్థులు ఇంకా పెద్ద మొత్తాలు ఖర్చు చేశారని తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి మరొకరు చెప్పారు.
పార్టీ ఎన్నికలలో నిలబెట్టిన 28 మంది అభ్యర్థులు ఒక్కొక్కరికీ లక్ష రూపాయలు వంతున రూ. 28 లక్షలు లెక్కగట్టి పంపించి ఉంటారని తృణమూల్ ప్రధాన కార్యదర్శి ఒకరు అభిప్రాయం వెలిబుచ్చారు. కాగా, 'నేను టాటా తొత్తును కాను... ఈ సంస్థ కారణంగా (సింగూర్ భూమి కొనుగోలుకు వ్యతిరేకంగా) నేను 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేయవలసి వచ్చింది' అని మమత అన్నట్లు తృణమూల్ ప్రధాన కార్యదర్శి ఒకరు చెప్పారు.
ఇది ఇలా ఉండగా, భారీ ఔషధ సంస్థ రాన్ బాక్సీ కూడా కాంగ్రెస్, అకాలీ దళ్ పార్టీలకు సమానంగా నిధులు సమకూరుస్తుండేదని 2004 - 05 సంవత్సరపు సంస్థ రికార్డుల ప్రకారం తెలియవచ్చింది. అయితే, గత సంవత్సరం జపాన్ కు చెందిన దయీచి శాంక్యో కొనుగోలు చేసిన ఈ సంస్థ ఈసారి ఎన్నికలకు కూడా అదే విధంగా నిధులు సమకూర్చిందా అనేది తెలియరాలేదు.
Pages: -1- 2 News Posted: 29 May, 2009
|