వయస్సు మళ్ళిన వాళ్ళొద్దు
హైదరాబాద్ : దేశం బాగుపడాలంటే రాజకీయాలలో యువతకు పట్టం కట్టాలి... ఇది ఈ సార్వత్రిక ఎన్నికల తరువాత చాలా బలంగా వినిపిస్తున్న వాదన. మరి దేశం బాగుపడాలంటే తలపండిన సీనియర్లు అనుభవంతో చేసే పాలన కావాలి... ఇది మంత్రి వర్గాల ఏర్పాటులో మన నేతలు ప్రదర్శిస్తున్న వైఖరి. ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అనుభవానికీ, నైపుణ్యానికీ అందలం అందిస్తుంటే, పరాజయం పాలై ఓటమికి కారణాలను అన్వేషిస్తున్న అన్ని పార్టీల్లోనూ సీనియర్లే కొంప ముంచారన్న కొట్లాటలు మొదలైయ్యాయి. యువతకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, అధినేతలు ఒంటెత్తు పోకడలతో నిర్ణయాలు తీసుకోవడం, వాస్తవాలను గ్రహించకుండా ప్రజలకు దూరంగా జరగడం కారణమని ఈపార్టలు లబోదిబోమంటున్నాయి. రాజకీయాలలో కాకలు తీరిన వామపక్షాలు, బీజేపీ, తెలుగుదేశం, తెరాస, కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం అన్నీ ఈపాటనే కొంచెం రాగాలు మార్చి పాడుకుంటున్నాయి.
అయితే జాతికి బాధ్యత వహిస్తున్న కేంద్ర కేబినెట్ ను కాంగ్రెస్ నాయకత్వం పూర్తిగా సీనియర్లతోనే నింపేసింది. కేబినెట్ మంత్రులందరూ దాదాపు 70 ఏళ్ళ వయస్సుపైబడ్డ వారే. కొత్త మంత్రులకు సహాయకులుగా మాత్రమే అవకాశం లభించింది. మాజీ ముఖ్యమంత్రులకు, కేంద్రమంత్రులకు మాత్రమే కేబినెట్ హోదా కల్పించింది. కీలక బాధ్యతలు అప్పగించింది. దేశ ఆర్థిక వ్యవహారాలను ప్రణబ్ ముఖర్జీకి, హోమ్ వ్యవహారాలను చిదంబరం వంటి అనుభవజ్ఞులకు కట్టబెట్టింది. ప్రధానిగా కూడా సీనియర్ అయిన మన్మోహన్ సింగ్ కే బాధ్యతలప్పగించింది.
Pages: 1 -2- News Posted: 29 May, 2009
|