వయస్సు మళ్ళిన వాళ్ళొద్దు
మన రాష్ట్ర రాజకీయ పార్టీల సమీక్షలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. వీటిలో సీనియర్ల పైన, వారి పాత్రపైనా తీవ్రమైన చర్చసాగుతోంది. సీనియర్లను బాధ్యతల నుంచి తప్పించాలని యువతకు అవకాశం కల్పించాలని డిమాండ్ మొదలైంది. కొత్త పార్టీ ప్రజారాజ్యంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్లను బాధ్యతల నుంచి తప్పించాలని ఆ పార్టీ శ్రేణులు సూచిస్తున్నాయి. యువతకే పగ్గాలివ్వాలని కోరుతున్నాయి. తెలుగుదేశం నిర్వహిస్తున్న మహానాడులో ప్రధానవక్తలంతా దీనిపైనే దృష్టి పెట్టారు. కొత్త తరానికి ప్రాధాన్యతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ రచన నుంచి ప్రభుత్వాల నిర్వహణ వరకు అన్నింటిలోనూ సీనియర్లకే పెద్దపీట వేశారు. వారి అనుభవాన్ని వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్లకే సముచిత ప్రాధాన్యత కల్పించారు. పార్టీ నిర్మాణంలో వారి రాజకీయ అనుభవాన్ని వినియోగించుకున్నారు. ఎన్నికల సమయంలోమాత్రమే యువతకు ప్రాధాన్యత నిచ్చారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి నిర్మించే క్రమంలో గాని, అభివృద్ధి చేయడంలో గాని సీనియర్ల ఆలోచనలు తెలుగుదేశం పార్టీకి ఎంతగానో ఉపయోగపడ్డాయి.
ఒకట్రెండు సార్లు ఎన్నికల్లో ఓటమిచెందినంత మాత్రాన సీనియర్లు ఇక పార్టీకి పనికిరారన్న దృక్పధం కనిపిస్తోంది. అంతలోనే వారి అనుభవం మొత్తం కొరగాకుండా పోతోంది. పార్టీల నిర్మాణానికి పునాదులేసిన సీనియర్లను ప్రక్కన పెట్టడం భావ్యం కాదన్న వాదన మొదలైంది. పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రంలో వామపక్షాల తరపున సీనియర్లే అధికారం కొనసాగిస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సీనియర్లే రాజకీయ చక్రం తిప్పుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన చెరో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు మన్మోహన్ కేబినెట్ లో కీలక బాధ్యతలు పోషిస్తున్నారు. రాష్ట్రాల్లోని సీనియర్ల సేవలను, అనుభవాలను వినియోగించుకుని కేంద్రం ముందుకెళుతోంది. మన రాష్ట్రంలోని తెలుగుదేశం, పిఆర్పీ వంటి పార్టీలు మేధావులైన అనుభవసారం తమకొద్దంటూ పేర్కొనడం సీనియర్లకు ఇబ్బందికరంగా పరిణమించింది.
Pages: -1- 2 News Posted: 29 May, 2009
|