138లో ఏమైందీ..?
ముందుగా ఒక్కో ప్రాంతానికి చెందిన ఒక్కో జిల్లాలో ఈ అంశాలపై అధ్యయనం చేయాలని, ఆ తర్వాత ఇతర జిల్లాల్లో కూడా ఇదే విధమైన అధ్యయనం చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. మహాకూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ సక్రమంగా జరగనప్పటికీ టిడిపి 92 స్థానాలను గెలుచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటన్న విషయంపై ముఖ్యంగా దృష్టి పెట్టనున్నారు. టిడిపి బలంగా ఉన్న నియోజకవర్గాలను వదిలిపెట్టి, ఓ మాదిరి బలం ఉన్న నియోజకవర్గాల్లో కూడా గెలుపొందడానికి కారణం కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండటమా? అభ్యర్థి ఎంపికలో లోపమా? రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వారికి అందడం లేదా, టిడిపి ప్రకటించిన పథకాల పట్ల ఆకర్షితులయ్యారా అన్న కోణాల్లో కూడా అధ్యయనం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయడానికి కారణాలు ఏమిటన్నది తెలిసినట్లయితే దాని ప్రకారం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడానికి వీలుగా ఉంటుందని ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
వివిధ రకాల పింఛన్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ, పావలా వడ్డకి రుణాలు, డ్వాక్రా మహిళలకు కొత్తగా ప్రవేశపెట్టనున్న పింఛన్ పథకాలు ప్రజల్లో ప్రభావం చూపాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆచరణలో ఇది ఎంత మేరకు వాస్తవమైందన్నది ఆయా వర్గాల ప్రజలను అడిగి తెలుసుకోనున్నారు. ఇందిరమ్మ ఇళ్ళ పథకం కొన్ని చోట్ల మాత్రమే ఓటర్లపై ప్రభావం చూపించగా, కొన్ని చోట్ల వ్యతిరేక ప్రభావం చూపించిందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. స్థానిక అధికారులు, పార్టీ ఎమ్మెల్యేలు ఇందిరమ్మ పథకాన్ని సరిగా పట్టించుకోకపోవడం, లబ్దిదారుల ఎంపికలో అవకతవకలు జరిగిన చోట్ల వ్యతిరేక ప్రభావం చూపించాయని భావిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 30 May, 2009
|