కొత్త బాస్, పేర్లు మాయం
న్యూఢిల్లీ : కొత్త బాస్ చేరే రోజు ప్రతి ఒక్కరిలో కలవరపాటు కనిపిస్తున్నది. అయితే, శాస్త్రి భవన్ లో ఉన్నత స్థాయి అధికారులు మాత్రం తాము ఈవిధంగా షాక్ తినవలసి వస్తుందని ఊహించలేదు. శుక్రవారం ఉదయం కొంత ముందుగా చేరుకున్న విద్య, సాంస్కృతిక మంత్రిత్వశాఖల ప్రధాన కార్యాలయాలలో కొందరు బాబులు (ఉన్నత స్థాయి అధికారులు) తమ ఆఫీసు తలుపుల వద్ద ఉండవలసిన నేమ్ ప్లేట్లు ఊడబెరికినట్లుగా కనిపించడంతో అప్రతిభులయ్యారు.
ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 15 మంది అధికారులు - డైరెక్టర్, సంయుక్త కార్యదర్శి స్థాయిలోని వారు - తమ ఇత్తడి నేమ్ ప్లేట్లు ఉండవలసిన ప్రదేశం ఖాళీగా ఉండడం చూసి ఒక విధమైన భయంతో వణకిపోయారు. విద్యా (మానవ వనరుల అభివృద్ధి) శాఖ మంత్రిగా కపిల్ సిబల్ బాధ్యతలు స్వీకరిస్తున్న రోజు మాయావతి తరహాలో మూకుమ్మడిగా ప్రక్షాళన జరిగిందా?
సరిగ్గా అప్పుడే ఒక అధికారపూర్వక నోటీసు వచ్చింది.
అంతే బాబులు హమ్మయ్య అని అనుకున్నారు.
కొత్త మంత్రి బాధ్యతలు చేపట్టగానే సాధారణంగా జరిగే, అధికార యంత్రాంగంలో మార్పులు చేర్పులు కాదని, ఒక దొంగ పని ఇదని తెలిసింది.
'తన నేమ్ ప్లేట్ మాయం కావడంతో కలవరపడిన ఒక అధికారి దగ్గర నుంచి మాకు ఉదయం మొదట ఆ విషయమై కాల్ వచ్చింది' అని శాస్త్రి భవన్ లో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లోని అధికారి ఒకరు చెప్పారు. 'మేము వెళ్ళి పరిశీలించాం. సుమారు 20 నేమ్ ప్లేట్లు చోరీ అయినట్లు కనుగొన్నాం. వాటిలో కనీసం 15 నేమ్ ప్లేట్లు గురువారం రాత్రి చోరీ అయినట్లు తోస్తున్నది' అని ఆయన తెలిపారు. ఈ వారం ప్రారంభంలో సుమారు ఐదు నేమ్ ప్లేట్ల చోరీ జరిగింది. కాని వాటి గురించి ఫిర్యాదులు మాత్రం మిగిలినవాటితో పాటు శుక్రవారం వచ్చాయి' అని ఆ అధికారి చెప్పారు.
Pages: 1 -2- News Posted: 30 May, 2009
|