కొత్త బాస్, పేర్లు మాయం
ఈ దొంగతనం గురించి వివరిస్తూ అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ ఒక నోటీస్ జారీ చేసి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఉన్నత స్థాయి అధికారులకు తెలియజేసింది.
అయితే, అప్పటికే సిబల్ మూడవ అంతస్తులోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన నేమ్ ప్లేట్ అంతకుముందే బిగించి ఉంది.
'ఇది నిజంగా దిగ్భ్రాంతి కలిగించేదే. మీ కొత్త బాస్ వచ్చిన తొలి రోజే, మీ గది బయట మీ నేమ్ ప్లేట్ అదృశ్యమైతే ఎలా ఉంటుందో ఊహించండి. ఇది ఎంతైనా మనసులో రకరకాల భయాలు కలిగిస్తుంది' అని చెప్పిన ఒక ఉన్నతాధికారి ఆతరువాత మధ్యాహ్నం ఈ అనుభవానికి నవ్వేశారు.
కాగా, సాంస్కృతిక శాఖకు మంత్రి పేరును ప్రభుత్వం ఇంకా ప్రకటించవలసి ఉంది. కాని తన నేమ్ ప్లేట్ మాయమైన ఒక అధికారి ఆ విషయం గ్రహించిన వెంటనే తన కింది స్థాయి అధికారికి ఫోన్ చేసి 'మంత్రి అనౌన్స్ తో నహీ హుయేఁ న (మంత్రి పేరున ఇంకా ప్రకటించలేదు కదా)' అని అడిగారు.
ఆ ఇత్తడి ప్లేట్లను కరిగించి తిరిగి పోతపోయవచ్చు. ఒక్కొక్కదాని వల్ల దొంగకు రూ. 150 వరకు ముట్టవచ్చు.
కొన్ని నేమ్ ప్లేట్లను స్క్రూలు తొలగించి తీసుకుపోగా మిగిలినవాటిని బలంగా ఊడబెరికారు. ఫలితంగా అధికారి పేరులోని మొదటి, చివరి అక్షరాలు తలుపుకు వేలాడుతూన్నాయి. వాటి స్క్రూలు తలుపులో బలంగా దిగిపోయి ఉన్నాయి.
పని వేళల తరువాత భవనంలోకి రాకపోకలు బాగా తక్కువగా ఉండే సమయంలో దొంగ కారిడార్లలోకి వచ్చి ఉండాలని అధికారులు అనుమానిస్తున్నారు.
Pages: -1- 2 News Posted: 30 May, 2009
|