మళ్లీ గుర్తుల తిప్పలు
హైదరాబాద్ : ప్రజారాజ్యం పార్టీ (పిఆర్పీ), లోక్ సత్తా (ఎల్ఎస్) రెండూ ఉమ్మడి గుర్తు సమస్యను మరొకసారి ఎదుర్కనవలసి రావచ్చు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఇసి) గుర్తింపు ఇంకా పొందనందున ఆ రెండు పార్టీలూ ఉమ్మడి గుర్తుతో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికలలో పోటీ చేయలేవు. తన వద్ద, భారత ఎన్నికల కమిషన్ (ఇసిఐ) వద్ద గల గుర్తింపు పొందిన పార్టీల జాబితాను ఎస్ఇసి ఈ నెల 27న జిహెచ్ఎంసికి పంపింది. ఆ జాబితాలో పిఆర్పీ, లోక్ సత్తా పార్టీలు లేవు.
ఎస్ఇసి జాబితా ప్రకారం, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్ పి), భారతీయ జనతా పార్టీ (బిజెపి), సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్ సిపి), రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్ జెడి) జాతీయ రాజకీయ పార్టీలు. తెలుగు దేశం పార్టీ (టిడిపి), తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ సి) గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు. ఎఐఎడిఎంకె, జనతా దళ్ (సెక్యులర్), సమాజ్ వాది పార్టీ (ఎస్ పి) ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు. అఖిల భారత మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) కూడా రిజర్వుడ్ గుర్తు ఉన్న రిజిస్టరైన రాజకీయ పార్టీ.
నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి తొలి అఖిల పక్ష సమావేశాన్ని కార్పొరేషన్ జూన్ 3న నిర్వహిస్తుంది. వెనుకబడిన తరగతుల (బిసి) వోటర్ల వివరాల సేకరణ కోసమే ప్రధానంగా ఈ సమావేశం జరుగుతుంది. అయితే, పిఆర్పీ, లోక్ సత్తా పార్టీలను ఈ సమావేశానికి ఆహ్వానించడం లేదు.
Pages: 1 -2- News Posted: 31 May, 2009
|