మళ్లీ గుర్తుల తిప్పలు
2001 జనాభా లెక్కల ప్రకారం, డివిజన్ (వార్డు)ల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందిస్తున్నారు. తుది కాపీని జూన్ 10న ప్రచురిస్తారు. గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు ఓటర్ల జాబితాల కాపీని ఉచితంగా అందజేస్తారు. నిబంధనల ప్రకారం గుర్తింపు కోసం, గుర్తు కోసం పిఆర్పీ, లోక్ సత్తా రెండూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది' అని సీనియర్ అధికారి ఒకరు సూచించారు.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలోని ప్రజారాజ్యం పార్టీ, డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ సారథ్యంలోని లోక్ సత్తా పార్టీ ఉమ్మడి గుర్తు కోసం నాలుగు నెలలకు పైగా పోరాడవలసి వచ్చింది. వాటి కేసును పరిశీలించవలసిందిగా ఎన్నికల కమిషన్ (ఇసి)ని సుప్రీం కోర్టు ఆదేశించిన తరువాత పిఆర్పీకి రైలింజన్ గుర్తు, ఎల్ఎస్ కు ఈల గుర్తు లభించాయి.
ఇది ఇలా ఉండగా, ఇంటింటి సర్వే ద్వారా బిసి ఓటర్ల నమోదు కార్యక్రమానికి జిహెచ్ఎంసి శ్రీకారం చుట్టింది. ఎస్ సి, ఎస్ టి రిజర్వేషన్లను 2001 జనాభా లెక్కల ప్రకారం నిర్ణయిస్తుండగా బిసి కోటాను తాజా ఓటర్ల వివరాల నమోదు ప్రక్రియ ఆధారంగా నిర్థారిస్తారు.
2002లో నిర్వహించిన మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో బిసిలకు 33 సీట్లను (33 శాతం) రిజర్వ్ చేశారు. బిసి జనరల్ ఓటర్లకు 22 సీట్లను, బిసి మహిళలకు 11 సీట్లను రిజర్వ్ చేశారు. పూర్వపు ఎంసిహెచ్ లోని 100 డివిజన్లలో ఎస్ టిలకు ఒక సీటును, ఎస్ సిలకు ఎనిమిది సీట్లను, బిసిలకు 33 సీట్లను, మహిళా అభ్యర్థులకు 20 సీట్లను రిజర్వ్ చేశారు.
Pages: -1- 2 News Posted: 31 May, 2009
|