మీరా నెగ్గుకురాగలరా?
న్యూఢిల్లీ : మృదుభాషి, మృదు స్వభావి మీరాకుమార్ కు అలజడి సృష్టిస్తుండే మన ఎంపిలను నియంత్రించడం ఒక సవాలే. కాని, తన స్వరాన్ని, భావాలను, బాడీ లాంగ్వేజిని మార్చుకోవడం ద్వారా తాను కఠినచిత్తురాలినేనని సంకేతాలు పంపవచ్చు.
మంద్ర స్వరంతో మాట్లాడే మీరా లోక్ సభలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి మానసిన శాస్త్రవేత్తలు కొన్ని సలహాలు ఇచ్చారు. ఉదాహరణకు గట్టి వ్యక్తిత్వం ఉన్నవారి స్వరం కొంత తక్కువగానే ఉంటుందని నెదర్లాండ్స్ లోని టిల్బర్గ్ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్న మార్క్ స్వెర్ట్స్ చెప్పారు. 'ఏవో కొన్ని భావాలను వ్యక్తం చేసే వారిని ఆత్మవిశ్వాసం మూర్తీభవించిన వ్యక్తులుగా పరిగణించవచ్చు. అయితే, వేగంగా కనుబొమలు కదిలిండడం లేదా నోటిని అటూ ఇటూ తిప్పడం నిస్పృహకు సూచికగా లేదా ఆత్మ విశ్వాసం లోపించిందనేందుకు సూచికగా భావించవచ్చు' అని స్వెర్ట్స్ పేర్కొన్నారు. సైగల ద్వారా అభిప్రాయాల వ్యక్తీకరణంలో ఆయన దిట్ట.
కచ్చితమైన పదజాలం, నేరుగా సందేశాలు, మాటల తడబాటు లేకుండా చూసుకోవడం వంటివి ఆత్మవిశ్వాసాన్నిసూచిస్తాయని కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎక్స్ పెరిమెంటల్ సైకాలజిస్ట్ అనిందితా చౌధురి చెప్పారు. 'మృదు స్వరం ఉన్న వ్యక్తి కూడా ఆ స్వరాన్ని ఉపయోగించే విధాన్ని బట్టి తన మాట నెగ్గించుకునే వ్యక్తిగా కనిపించవచ్చు' అని ఆమె సూచించారు.
మీరాకు ముందు స్పీకర్లుగా ఉన్నవారు సభపై గట్టి పట్టు సంపాదించారని అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీలు, హుందాతనం మూర్తీభవించిన రాజకీయ నాయకులు ఉన్న 1950, 1960 దశకాలలో అలా జరిగి ఉండవచ్చు.
గత లోక్ సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీతో పోలిస్తే 64 సంవత్సరాల మీరా కుమార్ పైకి కొంత అశక్తురాలిగా కనిపించవచ్చు. అయితే, చటర్జీ కరకు స్వరం గాని, న్యాయవాదిగా, పార్లమెంటరీవేత్తగా ఆయన సుదీర్ఘ అనుభవం గాని సభలో అలజడి రేపే సభ్యులను నియంత్రించడానికి దోహదం చేయలేకపోయాయి. ఏమీ చేయలేని స్థితిలో రాజీనామా అస్త్రాన్ని ఆయన సంధిస్తుండేవారు.
Pages: 1 -2- -3- News Posted: 3 June, 2009
|