మీరా నెగ్గుకురాగలరా?
ఐదుసార్లుగా ఎంపిగా ఉన్న మీరా కుమార్ తన పార్లమెంటరీ అనుభవంతో నెగ్గుకురాగలరని కేరళకు చెందిన సిపిఎం పార్లమెంట్ సభ్యుడు పి.కె. బిజూ అభిప్రాయం వెలిబుచ్చారు. 'ఆమో తన అనుభవాన్ని ఉపయోగంలోకి తీసుకురాగలరని నా ఆశ' అని ఆయన చెప్పారు. 'స్పీకర్ మహిళ అనే అంశం వల్ల తేడా ఏమీ రాదు' అని ఆయన అన్నారు.
అయితే, మీరా అవసరమైనప్పుడు సంగ్మా పద్ధతిని అనుసరించవచ్చు. ఒక్కొక్కసారి గద్దించడం కన్నా ఒక నవ్వుతో పని అయిపోతుందని సంగ్మా నిరూపించారు. సంగ్మా తరచు ఉల్లాస వదనంతో ఎంపిలను నిరుత్తరులను చేస్తుండేవారు. కొందరు బిజెపి సభ్యులతో సంగ్మాకు గల సత్సంబంధాలు ఆయనకు ఉపకరించాయి. అవే లేకపోవడం చటర్జీని ఇబ్బందికరమైంది.
సంక్లిష్ట సమస్యలపై స్పష్టమైన రూలింగ్ లు ఇవ్వడం మీరా విధులలో ఒకటి కాగలదు. మాజీ దౌత్యాధికారి అయిన మీరా ఇంటర్వ్యూలలో తన భావాలను స్పష్టంగానే వ్యక్తం చేస్తుంటారు. కాని, ఆమె సమాధానాలు బాగా ఆలోచించి ఇచ్చినవిగా ఒక్కొక్కసారి కనిపించేవి కావు.
ఇంగ్లీష్ లో ఎంఎ చేసిన ఢిల్లీ విశ్వవిద్యాలయంలోను, సివిల్ సర్వీసెస్ ప్రొబేషనర్ గా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ఇన్ స్టిట్యూట్ లోను ఆమె సమకాలీనుల అభిప్రాయం ప్రకారం ఆమె విశిష్ట ఆలోచనాపరురాలు కారు. 'మాకు ఆమె జగ్జీవన్ రామ్ కుమార్తె అంతే' అని ఒకరు చెప్పారు.
అయితే, అది 1985లో ఉత్తర ప్రదేశ్ లోని బిజ్నూర్ నుంచి పార్లమెంట్ కు ఆమె ఎన్నిక కావడానికి చాలా ముందుకాలం నాటి మాట. ఆమె రామ్ విలాస్ పాశ్వాన్, మాయావతిలను ఓడించారు. ఇప్పుడు దళితులను ఆకర్షించే ధ్యేయంతో కాంగ్రెస్ పార్టీ తిరిగి ఆమెను మాయావతిపై పోటీకి నిలబెట్టింది.
కాగా మీరా ఎలా నెగ్గుకు వస్తారో అనేది ఇప్పుడే సూచించలేమని బిజెపి సభ్యుడు షానవాజ్ హుస్సేన్ అంటున్నారు. 'ఒక మహిళను ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్ ఒక అనూహ్య పరిస్థితిని తీసుకువచ్చింది. దేశానికి ఇది సరైన సంకేతమే' అని ఆయన పేర్కొన్నారు.
Pages: -1- -2- 3 News Posted: 3 June, 2009
|