20 వరల్డ్ కప్ కు రెడీ
చాంపియన్ ఇండియాకు ఈ రౌండ్ పెద్ద సమస్య కానేకాదు. మిగతా గ్రూపుల్లో కొంత ప్రతిఘటన అయినా ఉన్నదేమోకానీ, ఈ గ్రూపులో మిగతా ప్రత్యర్థుల నుంచి ఇండియాకు ఎలాంటి గట్టి ప్రతిఘటన ఉండే అవకాశమే లేదు. జట్టులోని టాప్ ఆర్డర్ నుంచి టైలెండర్ల వరకు ఇండియా పటిష్ఠంగా ఉంది. గెలుపు సంగతి పక్క పెడితే, ఈ రెండు మ్యాచ్ ల్లో భారత్ ఏ మేరకు స్కోరు నమోదుచేయగలరనేది ఆసక్తికలిగించే అంశం. ఐర్లాండ్ తో పోల్చుకుంటే బంగ్లాదేశ్ తర్వాత స్థానంలో ఉంది. వారు ఏమాత్రం వారిపై బాగా ఆడగలిగితే సూపర్ 8 కు చేరుకోగలుగుతుంది. ఇటీవల బాగా రాణిస్తున్న ఐరిష్ ఆటగాళ్ళు కోచ్ ఫిల్ సిమ్మన్స్ సారథ్యంలో శిక్షణ అందుకున్నారు. వారిని తక్కువగా అంచనా వేస్తే బంగ్లాదేశ్ ఇబ్బంది పడుతుంది.
ఈ గ్రూపులో బలమైన జట్టు ఇంగ్లాండే. యాండీ ఫ్లవర్ కోచ్ గా ఇటీవల ఆ జట్టు బాగా రాణిస్తున్నది. వెస్టిండీస్ పై కొద్ది నెలల క్రితం వన్డే సిరీస్ ను గెలుచుకుని వచ్చిన ఇంగ్లాండ్ సొంతగడ్డమీద ఈ కప్ ను బయటకు పోనీయకుండా చూడాలని అనుకుంటుంది. ఆరునెలల క్రితం సమస్యలతో సతమతమైనప్పటికీ ప్రస్తుత ఇంగ్లాండ్ కు ఆ పరిస్థితి లేదు. జట్టులో బొపారా, కెవిన్ పీటర్సన్ లాంటి హార్డ్ హిట్టర్స్ ఉన్నారు. గత సంవత్సరం రన్నరప్ గా నిలిచిన పాకిస్థాన్ ఈసారి మాత్రం అంత ఊపు మీద లేదు. ఇటీవల ఆస్ట్రేలియాతో అబుధాబిలో జరిగే ఐదు వన్డేల సిరీస్ లోనూ ఆ జట్టు ఓడిపోయింది. అయితే పాకిస్థాన్ కు ఉన్న బలం లక్ష్యాన్ని అందుకోగలమనే విశ్వాసం ఉండడం. అలాగే యూనిస్ ఖాన్ తో పాటు హార్డ్ హిట్టర్స్ ఉన్న పాకిస్థాన్ ఈసారి కప్ అందుకోవాలని అనుకుంటున్నప్పటికీ జట్టు యావత్తూ సమిష్ఠిగా రాణించగలిగితేనే విజయాలు సాధ్యమవుతాయి. బలహీనమైన జట్టు నెదర్లాండ్సే. కాబట్టి మిగతా రెండు సునాయాసంగా త్వరాత రౌండ్ కు చేరుకునే వీలుంది.
Pages: -1- 2 -3- News Posted: 5 June, 2009
|