20 వరల్డ్ కప్ కు రెడీ
ఇటీవల వన్టేల్లో ప్రాభవం కోల్పోయిన ఆస్ట్రేలియా ఈ ద్వితీయ ట్వంటీ 20 కప్ ను అందుకోవడం ద్వారా మూడు ప్రపంచకప్ వన్డేల సరసన దీన్ని నిలుపుకోవాలని ఆశిస్తున్నది. అయితే ఆస్ట్రేలియా మంచి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్తో ఉన్నప్పటికీ ముఖ్యమైన ఆటగాళ్ళు లేకపోవడం వారిని ఆందోళన కలిగిస్తున్న విషయం. గత సంవత్సరం హేడెన్ రిటైర్మెంట్ ప్రకటించగా జట్టులోని హార్డ్ హిట్టర్ సైమండ్స్ మద్యం తాగి వేటుకు గురయ్యాడు. కీలకమైన బౌలర్ బ్రెటలీ ఇంకా పూర్తి స్థాయిలో శస్త్రచికిత్స నుంచి కోలుకోలేదు. మరో జట్టు విండీస్ ప్రధాన ఆయుధం క్రిస్ గేల్. గేల్ కనుక 10 ఓవర్లు నిలబడి ఆడితే విండీస్ ను అడ్డుకోవడం కష్టమే. అలాగే ఆ జట్టులో ఇంకా అద్భుతంగా రాణించగలిగే చందర్ పాల్, శర్వాణ్, బ్రేవో ఉన్నారు. వారు రాణించడం పైనే విండీస్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కొత్త కెప్టెన్ సంగక్కార నాయకత్వంలోని ఆ జట్టులో దిల్షాన్, జయర్థనే, కులశేఖర్ లాంటి చక్కటి ఆటగాళ్ళున్నారు. అలాగే బౌలింగ్ విభాగంలో మెండిస్, మురళీధరన్ ఉన్నప్పటికీ వారి కంటే కూడా మలింగ పైనే వారి ఆవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఉపఖండంలో కండీషన్స్ కు భిన్నంగా వాతావరణం ఇంగ్లాండ్ లో ఉన్నందున శ్రీలంక జట్టు ఏ మేరకు రాణిస్తుందో చూడాల్సిందే.
స్మిత్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా ఇటీవలకాలంలో అద్బుతంగా రాణిస్తూ ఉంది. ఆ జట్టులో కలిస్, బౌచర్, బోతా, డుమినీ, స్టేన్ లాంటి టాప్ క్లాస్ ఆటగాళ్ళున్నారు. వీరంతా ఎలాంటి పిచ్ లపైన అయినా అమోఘంగా రాణించగల సత్తా ఉన్న వాళ్ళు. ఇక కెప్టెన్ స్మిత్ ఓపెనర్ గా కెప్టెన్ గా తమ జట్టును ముందుండి నడిపించగల సమర్థుడు. సొంతగడ్డ మీద రెండేళ్ళ క్రితం సెమీస్ నుంచే తిరిగి వచ్చిన దక్షిణాఫ్రికా ఈ సారి మాత్రం ఫైనల్ వరకు చేరుకుని కప్ ను అందుకోగలమనే ఆకాంక్షతో ఉంది. డానియెల్ వెట్టోరి నాయకత్వంలోని న్యూజిలాండ్ జట్టు ఆల్ రౌండర్లతో నిండి ఉంది. ఆ జట్టులో మెక్ కల్లమ్, రాస్ టేలర్, రైడర్, డివిలియర్స్, జాకబ్ ఓరం లాంటి డాషింగ్ హిట్టర్స్ ఉన్నారు. స్పిన్ విభాగంలో వెట్టోరి స్వయంగా ప్రత్యర్థిని నియంత్రించగల బౌలర్. తమదైన రోజున కివీస్ ను నిలవరించడం కష్టమే. ఈ గ్రూపులో బలహీనమైన జట్టు స్కాట్లాండే. ఈ రెండు బలమైన జట్లతో నిలబడి తర్వాత రౌండ్ కు చేరుకోవడం వారికి కష్టమే.
Pages: -1- -2- 3 News Posted: 5 June, 2009
|