100 రోజుల ప్లాన్ జరిగేనా?
విద్యా రంగానికి సంబంధించి రెండు ప్రతిపాదనలు ముఖ్యమైనవి. ఉన్నత విద్యా సంస్థలను నియంత్రించేందుకు అత్యున్నత స్థాయిలో ఏకీకృత వ్యవస్థగా పని చేసేందుకు జాతీయ ఉన్నత విద్యా మండలి (ఎన్ సిహెచ్ఇ)ని ఏర్పాటు చేయాలనేది వాటిలో ఒకటి. ఇది సాధ్యమేనా? ఎంతో పట్టుదల అవసరమైన బృహత్తరమైన బాధ్యత ఇది. దీనికి యుజిసి, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఎఐటియుసి) వంటి ప్రస్తుత నియంత్రణ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావచ్చు. ఇందుకు ఒక చట్టం చేయవలసి ఉంటుంది. జాతీయ నాలెడ్జి కమిషన్, యశ్ పాల్ కమిటీ ప్రతిపాదించిన, దేశంలో ఉన్నత విద్యా విధానం పునర్వ్యవస్థీకరణకు ఎన్ సిహెచ్ఇ నాందీ ప్రస్తావన కాగలదు. ఇది నిబంధనలను సరళీకరించి, వివిధ కోర్సుల అధ్యయనానికి, పరిశోధనకు వీలు కలిగిస్తుంది.
కొత్తగా ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసిన 14 అంతర్జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల కోసం ప్రతిభావంతులైన అధ్యాపకులను, పరిశోధకులను ఆకర్షించడానికి 'బ్రెయిన్ గెయిన్' విధానాన్ని రూపొందిస్తామనేది రెండవ ప్రతిపాదన. ఇది కూడా జరిగేనా? ఈ విధానాన్ని ప్రవేశపెట్టవచ్చు. యుజిసి ఇదివరకే ఇందు నిమిత్తం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న ప్రస్తుత పరిస్థితులలో స్వదేశానికి మేధావుల వలస త్వరలోనే ప్రారంభం కాగలదు. అయితే, ఆవిధమైన వలస కొనసాగేట్లు చూడడానికి కొంత వ్యవధి పట్టుతుంది. 'బ్రెయిన్ గెయిన్' విజయవంతమైన పక్షంలో భారతీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటిలు, ఐఐఎంలు, ఇతర విద్యా సంస్థలలో ఫ్యాకల్టీకి పెద్ద ఎత్తున ఉన్న కొరతను తీర్చవచ్చు.
ఆరోగ్య రంగానికి సంబంధించి కొత్తగా ఒక ప్రతిపాదనను ప్రభుత్వం చేసింది. ప్రస్తుత నియంత్రణ సంస్థలను సంస్కరించేందుకు ఒక ఉన్నత స్థాయి సంస్థ 'ఆరోగ్య రంగంలో మానవ వనరుల జాతీయ మండలి' (ఎన్ సిహెచ్ఆర్ హెచ్)ను ఏర్పాటు చేయాలనేదే ఆ ప్రతిపాదన. ఇప్పుడున్న నియంత్రణ సంస్థ 'భారత వైద్య మండలి' (ఎంసిఐ) నుంచి ఇందుకు వ్యతిరేకత ఎదురుకావచ్చు.
Pages: -1- 2 -3- News Posted: 6 June, 2009
|