100 రోజుల ప్లాన్ జరిగేనా?
పారదర్శకత విషయమై కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం చేసింది. వాటిలో ఒకటి ప్రధాన (ఫ్లాగ్ షిప్) కార్యక్రమాల అమలును, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడానికి ప్రణాళికా సంఘంలో ఒక స్వతంత్ర మదింపు విభాగాన్ని, ప్రధాని కార్యాలయం (పిఎంఒ)లో పంపిణీ పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేయాలనేది. ఇది అమలు చేయడానికి కష్టమైనదేమీ కాదు. ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలపై భారత్ నిర్మాణ్ త్రైమాసిక నివేదికలు సమర్పించాలనేది మరొక ప్రతిపాదన. కార్యక్రమాల అమలుపై మంత్రులు మీడియా ద్వారా తెలియజేస్తారు. ఇది కూడా అమలు చేయడం కష్టమైనదేమీ కాదు. వ్యూహాత్మకం కాని సమాచారాన్నంతనూ ఐచ్ఛికంగా వెల్లడి చేయడానకి పబ్లిక్ డేటా విధానాన్ని ప్రవేశపెట్టాలనేది వేరొక ప్రతిపాదన. దీనికి అధికార యంత్రాంగం నుంచి బాహాటంగా కాకపోయినా వ్యతిరేకత వ్యక్తం కావచ్చు. దీని వల్ల పారదర్శకతను తీసుకురావడానికి చేసే కృషి నీరు కారిపోవచ్చు.
ఎన్ఆర్ఇజిఎ (ఎన్ రెగా)కు సంబంధించి సాంఘిక ఆడిట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, జిల్లా స్థాయి ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఒకటి ఉన్నది. రాజకీయ సంకల్పం, ఆశీస్సులు ఉన్న దృష్ట్యా దీనిని అమలు చేయడం అంతగా కష్టం కాకపోవచ్చు. సమాచార హక్కు (ఆర్ టిఐ) చట్టాన్ని పటిష్ఠం చేయాలనే ప్రతిపాదన ఉన్నది. చట్టాన్ని పటిష్ఠం చేసే విధంపై స్పష్టత లేదు. అయితే, నిజంగా పటిష్ఠం చేయాలనుకున్నా అధికార యంత్రాంగం నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది.
మూడు సంవత్సరాలలో అన్ని పంచాయతీలలో ఇ-పాలనను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదన అమలు పరచడం కష్టం కారాదు. దీనిని అమలు జరిపినట్లయితే, ప్రభుత్వ డేటా ప్రజలకు సులభంగా అందుబాటులోకి వస్తుంది. పౌరులకు సంబంధించిన సమాచారం కూడా లభ్యం కాగలదు. వారు అప్పుడు లోటుపాట్లపై ప్రశ్నించగలరు. ప్రాజెక్టుల అమలు సరిగ్గా లేకపోతే కూడా ప్రశ్నించగలరు. సాంఘిక రంగ పథకాల లబ్ధిదారులు (ఎన్ రెగా వంటి పథకాల విషయంలో) ఆదాయాన్ని లేదా (విద్య విషయంలో) స్కాలర్ షిప్ లను డ్రా చేసుకోగలిగేందుకు వీలుగా బ్యాంకులను, పోస్టాఫీసులను ప్రజలకు మరింత ఉపయుక్తంగా మార్చాలనే ప్రతిపాదన నిజానికి అమలుకు కష్టమైనదేమీ కాదు. దీని వల్ల సాంఘిక రంగ పథకాల లబ్ధిదారులకు నిధుల బదలాయింపుపై తనిఖీ తేలిక అవుతుంది.
రైల్వేలు, విద్యుచ్ఛక్తి, రహదారులు, రేవులు, విమానాశ్రయాలు, గ్రామీణ టెలికామ్ రంగాలలో మౌలిక వసతుల ప్రాజెక్టుల అమలులో లోపాలను, జాప్యాలను తొలగించాలనే ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకురావడానికి అధికార యంత్రాంగం నుంచి ఆదిలో ప్రతిఘటన ఎదురుకావచ్చు. కాని చివరకు ఆ సమస్యలను అధిగమించవచ్చు. 100 రోజుల గడువు తక్కువేనని తేలవచ్చు. అయితే, కొన్ని చర్యలు తీసుకోవడానికి ఆ వ్యవధి చాలు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంలో ప్రాజెక్టులకు శీఘ్రంగా అనుమతి ఇవ్వాలని, నియంత్రణ ప్రక్రియను పెట్టుబడులకు సానుకూలంగా చేయాలనే ప్రతిపాదన ఉన్నది. ఇది కూడా అమలుకు కష్టమైనదేమీ కాదు. దీనిని 100 రోజులలో సాధించవచ్చు.
Pages: -1- -2- 3 News Posted: 6 June, 2009
|