ఇది నమ్మలేని 'సత్యం'!
హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ కుంభకోణానికి వేదికగా నిలిచిన సత్యం కంప్యూటర్స్ ఆస్తుల విలువ అంచనాలకు అందనంతగా ఉన్నట్లు సిబిఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఒక్క భారత్‌లోనే ఈ సంస్థకు 50 వేల కోట్ల రూపాయల ఆస్తులు వున్నాయని, విదేశాల్లో ఇంతకు రెట్టింపుగా ఆస్తులు ఉండి ఉంటాయని సిబిఐ ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఈ సంస్థ మాజీ చైర్మన్ రామలింగరాజు ఆయన సోదరుడుసంస్థ మాజీ సీఈఓ రామరాజుల ఆస్తులు పది వేల కోట్ల రూపా యల వరకు ఉంటాయని సిబిఐ భావిస్తున్నట్లు తెలిసింది. కాగా మొత్తం ఆస్తుల విలువను మరో నెల రోజుల్లో మదింపు వేసి కేంద్రానికి ఓ నివేదికను సిబిఐ సమర్పించనుంది.
భారత కార్పొరేట్ రంగాన్ని ప్రపంచ స్థాయిలో భ్రష్టు పట్టించిన సత్యం కంప్యూటర్స్ గోల్‌మాల్‌పై విచారణ చేస్తున్న సిబిఐ అధికారులకు నమ్మ లేని నిజాలు వెలుగు చూడసాగాయి. ప్రపంచ వ్యాప్తంగా షేర్ మార్కెట్ ఖాతా దారులను నిండా ముంచిన సత్యం వ్యవహారంపై మొదట సిఐడి అటు పిమ్మట సిబిఐ విచారణ చేబట్టిన సంగతి తెలిసిందే. సిఐడి అధికారుల విచారణలోనే సత్యం అధినేతలైన రామలింగరాజు, రామరాజులు అనేక అక్ర మాలకు పాల్పడినట్లు తేలింది. లేని ఆస్తులు వున్నట్లుగా చూపి వేల కోట్ల రూపాయలను మేటాస్‌కు మళ్లించారని తేల్చారు. ఇదే సమయంలో సత్యం షేర్ల విలువ పతనం కాగా రాజు బ్రదర్స్ మాత్రం తమ షేర్లను ముందుగానే తెలివిగా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు కూడా ిసీఐడీ తేల్చింది.
Pages: 1 -2- -3- News Posted: 7 June, 2009
|