ఇది నమ్మలేని 'సత్యం'!
అయితే సత్యం వ్యవహారంపై ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడులు అధికమవడంతో, కంపె నీ వ్యవహారల శాఖ ఈ కేసును సిబిఐకి అప్పగించింది. మొదట సత్యం అక్రమాలపై దృష్టి సారించిన సిబిఐ అధికా రులు అంతకు ముందు సిఐడి సేకరించిన సమాచారాన్ని వాడుకున్నా రు. ఈ సమాచారం ఆధారంగా సత్యం మాజీ అధిపతులతో పాటు సంస్థకు చెందిన మాజీ ఉన్నతాధికారుల గోల్‌మాల్ చిట్టాను తయారు చేశారు. వీరందరిపై కోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు. అయితే ఇదంతా ఒక ఎత్తుకాగా సత్యంకు చెందిన ఆస్తుల మదింపు మరో ఎత్తుగా చెప్పవచ్చు. సత్యం కంప్యూటర్స్ పేరిట వున్న ఆస్తులతో పాటు, రాజు బ్రదర్స్ పేరిట వున్న ఆస్తులను గుర్తించేందుకు సిబిఐ రెం డు నెలల క్రితం చేబట్టిన స్పెషల్ ఆపరేషన్ దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. సత్యంకు సంబంధించి భారత్‌లో 50 వేల కోట్ల రూపాయల ఆస్తులు వున్నాయని సిబిఐ ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలుస్తోం ది.
ఈ ఆస్తుల్లో మన రాష్ట్రంలోనే 25 నుంచి 30 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఖరీదైన భూములు, బడా బంగళాలు వున్నాయని సిబిఐ తేల్చినట్లు తెలిసింది. దీంతోపాటు దేశం లోని ఇతర ప్రాంతాలలో మిగతా ఆస్తులు వున్నట్లు సిబిఐ నిర్దారణకు వచ్చినట్లు తెలిసింది. ఇదే సమయంలో విదేశాల్లో ముఖ్యంగా అమెరికాతోపాటు పలు యూరప్ దేశాల్లో ఇంతకు రెట్టింపుగా సత్యం ఆస్తులు వుండివుం టాయని సిబిఐ బావిస్తోంది. విదేశాల్లో చాలా కాలంగా సత్యం ఐటి సేవలను అందిస్తూ స్థిర ఆస్తులను కూడ బెట్టినట్లుగా సిబిఐ భావిస్తోంది. అమెరికాలో సత్యంకు వేల కోట్ల విలువ చేసే బంగళాలు, ఇతర ఆస్తులు వుండి వుంటాయని సిబిఐ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. విదేశాల్లో సత్యంకు వున్న ఆస్తులను పూర్తిస్థాయిలో మదింపు వేసేందుకు సిబిఐకి మరో నెల రోజులు పట్టేట్టుంది. ఈ విషయంలో ఇప్పటికే సిబిఐ అధి కారులు పలు దేశాల్లో పర్యటించి ఆస్తుల వివరాలను సేకరించారు.
సత్యం ఆస్తుల వివరాల సేకరణలో ఓ కొలిక్కి వచ్చిన సిబిఐ ఈ ఆస్తులను ఎవరిపరం చేయాలనే విషయంలో మాత్రం ఇంతవరకు ఓ నిర్ణయం తీసుకోలేక పోతోంది. సాధారణంగా ఓ బడా కంపెనీ తన ఖాతా దారులను మోసం చేసి బిచాణా ఎత్తివేస్తే ఆ సంస్థ ఆస్తులను సర్కారు జప్తు చేసి అనంతరం వాటిని వేలం వేసి వచ్చిన సొమ్మును మోసపోయిన బాధితులకు అందజేయడం ఇప్పటివరకు జరుగుతోంది. రాష్ట్రంలో కృషి బ్యాంకుతో పాటు మరి కొన్ని సంస్థల విషయంలో సర్కారు దీనిని ఆచరణలో పెట్టింది. అయితే సత్యం విషయానికి వచ్చే సరికి బాధితులంతా షేర్లు కొన్నవారు కావడంతో వారికి సత్యం ఆస్తులను అమ్మగా వ చ్చిన సొమ్మును ముట్టచెప్పడం చట్టరీత్యా చెల్లుబాటు అయ్యే అవకాశాలులేవు. ఇదే సమయంలో సత్యంను టేకోవర్ చేసిన టెక్ మహింద్రా కంపెనీ కి కూడా సత్యం ఆస్తులు పూర్తిగా దక్కే అవకాశాలు లేవని పోలీసు అధికారులు అంటున్నారు. సత్యం ఆస్తులను ఇప్పటివరకైతే కేంద్ర పరం అయ్యే అవకాశాలు న్నాయి. ఈ ఆస్తులను కేంద్రం ఆధీనంలో వుంచి కోర్టు ఎలా చెబితే అలా నడుచుకోవాలని పోలీసు అధికారులు అభిప్రా యపడుతున్నారు.
Pages: -1- 2 -3- News Posted: 7 June, 2009
|